పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. కరోనా పరీక్షలు.. రాష్ట్రపతి ప్రసంగం

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (10:51 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. తొలుత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దేశ బడ్జెట్‌ను సమర్పిస్తారు. బడ్జెట్ సెషన్ కోసం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. భద్రత దృష్ట్యా, బడ్జెట్ సెషన్‌కు ముందు సభ్యులందరికీ, ఉద్యోగులకూ కరోనా పరీక్షను తప్పనిసరి చేశారు.
 
ఈ సందర్భంగా 1,209 మంది అధికారులు, సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. రాష్ట్రపతి ప్రసంగం శుక్రవారం ఉదయం 11.00 నుంచి ప్రారంభమవుతుంది. సెంట్రల్ హాల్‌లో 144 మంది పార్లమెంటు సభ్యులు, మంత్రుల మండలి, లోక్‌సభ, రాజ్యసభ ప్రత్యేక కమిటీల ఛైర్‌పర్సన్స్, ఉభయ సభల్లోని వివిధ పార్టీలు, గ్రూపుల నాయకులు, మాజీ ప్రధాని, జాతీయ అధ్యక్షుడు ఉంటారు.
 
సభ్యులందరూ ఒకరికొకరు 6 అడుగుల దూరంలో కూర్చుంటారు. రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా పార్లమెంటు సభ్యులు సెంట్రల్ హాల్‌తో పాటు లోక్‌సభ, రాజ్యసభల్లో కూర్చోవడం ఇదే మొదటిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments