Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2020 ఎఫెక్ట్ : ధరలు పెరిగే వస్తువులేంటి? తగ్గేవి?

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (16:15 IST)
కొత్త ఆర్థిక సంవత్సరం 2020-21కి గాను కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం ఆమె లోక్‌సభకు తన బడ్జెట్‌ను సమర్పించారు. ఈ బడ్జెట్‌లో దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం, ఆదాయ అసమానతలు, మందగమనంలో సాగుతున్న ఆర్థిక వృద్ది రేటు.. ఇలా.. పలు సవాళ్లు బడ్జెట్ మీద నీలినీడలు పరిచినా.. అందరికి ఆమోదభాగ్యంగానే కేంద్రం బడ్జెట్‌ను సమర్పించింది.
 
అయితే, ఈ బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీని పెంచారు. ఫలితంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫర్నీచర్, చెప్పులు ధరలు పెరగనున్నాయి. అలాగే ఎ​క్సైజ్‌ డ్యూటీ పెంపు కారణంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి. 
 
మరోవైపు, ఎలక్ట్రికల్ వాహనాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాలపై కేంద్రం పన్ను తగ్గించింది. అంతేకాకుండా విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న న్యూస్ ప్రింట్‌పై కూడా పన్నును తగ్గించారు. ఇక వైద్య పరికరాలపై 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గేవి, పెరిగేవి ఏవో ఇప్పుడు చూద్దాం..
 
ధరలు తగ్గే వస్తువులు 
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌
ఎలక్ట్రిక్‌ వాహనాలు
మొబైల్‌ ఫోన్ల విడిభాగాలు
ప్లాస్టిక్‌ ఆధారిత ముడి సరుకు
 
ధరలు పెరిగే వస్తువులు
ఫర్నీచర్‌
చెప్పులు
సిగరెట్లు
పొగాకు ఉత్పత్తులువైద్య పరికరాలు
కిచెన్‌లో వాడే వస్తువులు
క్లే ఐరన్‌
స్టీలు
కాపర్‌
సోయా ఫైబర్‌, సోయా ప్రోటీన్‌
కమర్షియల్‌ వాహనాల విడిభాగాలు
స్కిమ్డ్‌ మిల్క్‌
వాల్‌ ఫ్యాన్స్‌
టేబుల్‌వేర్ 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments