Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీకి హార్దిక్ పటేల్ మద్దతు.. మోదీ మళ్లీ ప్రధాని ఐతే ఎన్నికలే వుండవ్

పోర్న్ స్టార్‌ కమ్ బాలీవుడ్ ఐటమ్ గర్ల్‌గా మారిన సన్నిలియోన్‌కు ప్రస్తుతం హీరోయిన్ పాత్రలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. నటిగా మంచి మార్కులు కొట్టేస్తున్న సన్నీలియోన్.. ప్రస్తుతం భారీ బడ్జెట్ దక్షిణాది

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (16:55 IST)
పోర్న్ స్టార్‌ కమ్ బాలీవుడ్ ఐటమ్ గర్ల్‌గా మారిన సన్నిలియోన్‌కు ప్రస్తుతం హీరోయిన్ పాత్రలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. నటిగా మంచి మార్కులు కొట్టేస్తున్న సన్నీలియోన్.. ప్రస్తుతం భారీ బడ్జెట్ దక్షిణాది మూవీ ''వీరమహాదేవి'' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం సన్నీ జీవిత కథ ఆధారంగా వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. 
 
సన్నీలియోన్ అసలు పేరు కరణ్ జీత్ కౌర్. అయితే కరణ్ జీత్ కౌర్ సన్నీలియోన్‌గా ఎలా మారింది. దీని వెనక ఉన్న కారణాలు ఏమిటన్నదే ఈ వెబ్‌సిరీస్‌లో చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో పోర్న్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా ఎదిగిన సన్నీలియోన్‌కు గుజరాత్ యువనేత హార్దిక్ పటేల్ మద్దతుగా నిలిచారు. పోర్న్ స్టార్ అనే గత కాలపు ఇమేజ్‌తోనే సన్నీని ఎందుకు చూస్తారని ప్రశ్నించారు. అలాచూస్తే ఈ దేశం మారదన్నారు. 
 
మధ్యప్రదేశ్, ఇండోర్‌లో హార్దిక్ పటేల్ మాట్లాడుతూ.. నటీమణులు నర్గీస్, శ్రీదేవి, మాధురీదీక్షిత్‌లా సన్నీని చూడటం వల్ల ఇబ్బంది ఏమిటని అడిగారు. సన్నీని ఇప్పటికీ పోర్న్‌స్టార్‌గానే చూడాలనుకుంటే.. ఈ దేశం ఎప్పటికీ మారబోదని హార్దిక్ పటేల్ చెప్పారు. 2019 ఎన్నికల్లో మోదీ మరోసారి ప్రధాని అయితే ఇక ఆ తర్వాత ఎన్నికలే ఉండవని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా అభిమానులకు ఫీస్ట్ లా చిరంజీవి విశ్వంభర తాజా అప్ డేట్

మ్యూజికల్ డ్రామాలో అనిరుధ్ మ్యాజిక్ చిత్రం నుంచి గీతం విడుదల

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం