సన్నీ లియోన్‍ను అలా చూడాలి : హార్దిక్ పటేల్

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కు దిగుమతి అయిన భామ సన్నీ లియోన్. ఈమె ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా, తెలుగు చిత్రాల్లో కూడా నటించింది. ఈమె నటుకు ఒక వర్గం ప్రశంసల వర్షం కురిపిస్తుంటే మరికొందరు మాత్రం విమర

సోమవారం, 11 జూన్ 2018 (14:00 IST)
పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కు దిగుమతి అయిన భామ సన్నీ లియోన్. ఈమె ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా, తెలుగు చిత్రాల్లో కూడా నటించింది. ఈమె నటుకు ఒక వర్గం ప్రశంసల వర్షం కురిపిస్తుంటే మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే, గుజరాత్ పాటీదార్ ఉద్యమ యువ నేత హార్దిక్ పటేల్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి మరోలా చెపుతున్నాడు.
 
పోర్న్‌స్టార్ సన్నీలియోన్‌ను బాలీవుడ్ నటీమణులు నర్గీస్, మాధురి తదితరుల నటులతో సమానంగా చూడాలన్నారు. సన్నీలియోన్‌ను ఇతర నటీమణుల మాదిరిగా ఎందుకు చూడలేకపోతున్నాం? తెరపై ఆమెను తప్పుగా ఎందుకు చూడాల్సి వస్తోంది? మన ఆలోచనా విధానం మారాలి. సన్నీలియోన్‌ను ఆమె గతంనాటి దృష్టితోనే చూస్తే దేశంలో ఎప్పటికీ మార్పురాదు అని వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ముక్కులోకి వెళ్లిన జలగ... ఎలా బయటకు తీశారో చూడండి (వీడియో)