Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ ఫూల్ అవుతారా? ఏప్రిల్ ఫూల్ చేస్తారా? అసలేంటి దీని వెనుక కథ?

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (19:36 IST)
మరికొన్ని గంటల్లో ఏప్రిల్ 1 వచ్చేస్తుంది.. అంటే.. ఈరోజు మనకు తెలిసిన వారిని ఎలా ఫూల్ చేయాలని ఆలోచించి మరీ అందుకు అనుగుణంగా ప్లాన్ చేసి వారిని ఫూల్స్‌ను చేస్తుంటాం. అసలు నిజానికి ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసుకుందాం..
 
ఇప్పటి కాలంలో కొత్త ఆంగ్ల సంవత్సాన్ని జనవరి 1వ తేదీన జరుపుకుంటున్నాం. కానీ, ఒకప్పటి కాలంలో ఏప్రిల్ 1వ తేదీన రోమన్లు, యురోపియన్లు కొత్త సంవత్సరం ఆరంభ తేదీగా జరుపుకునేవారు. అయితే 1582వ సంవత్సరంలో పోప్ గ్రెగరీ అనే చక్రవర్తి కొత్త క్యాలెండర్‌ను తయారు చేయించారు. అలా క్యాలెండర్‌నే జియోర్జియన్ క్యాలెండర్ అని పిలుస్తారు. 
 
ఈ క్యాలెండర్ ప్రకారమే కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకోవాలని ఆ రాజుగారు ఆదేశించారట. అందువలనే అందరూ అప్పటి నుండి జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటూ వచ్చారు. కానీ, సదరు రాజు గారు పెట్టిన ఈ నిబంధన కొందరికి మాత్రం నచ్చలేదట. దీంతో వారు ఏప్రిల్ 1వ తేదీన్నే నూతన సంవత్సరాన్ని యథావిధాగా జరుపుకునేవారు.
 
ఈ క్రమంలో రాను రాను జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరాన్ని జరుపుకునే వారు పెరిగిపోయి, ఏప్రిల్ 1వ తేదీన నూతన సంవత్సరం జరుపుకునే వారి సంఖ్య తగ్గుత్తూ వచ్చింది. దాంతో అందరూ ఏప్రిల్ 1వ తేదీన కొత్త సంవత్సరాన్ని జరుపుకునే వారిని మూర్ఖులలా చూడడం మొదలుపెట్టారు. క్రమంగా వారిని ఫూల్స్ అనడం ప్రారంభించారు. దీంతో ఏప్రిల్ 1వ తేదీన కొత్త సంవత్సరం జరుపుకునేవారిపై ఫూల్స్ అనే ముద్ర పడింది. ఇక రాను రాను ఫూల్స్ డేగా మారింది. ఇదే.. ఏప్రిల్ 1వ తేది ఫూల్స్ డే కావడానికి వెనుక ఉన్న అసలు కథ. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments