రైలు ఢీకొన్నా.. ఆ వ్యక్తి ప్రాణాలతో మిగిలాడు.. లక్ అంతే అదే! (video)

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (19:08 IST)
Man
రైలు ఢీకొన్నా.. ఆ వ్యక్తి ప్రాణాలతో మిగిలాడు. రైలు ఢీకొన్నా.. ప్రాణాలతో బయటపడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా అదృష్టవంతుడేనని కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని భాగల్ పూర్‌లో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌ను హడావుడిగా దాటుతూ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. 
 
రైలు మొత్తం అతని మీదుగా వెళ్ళింది. కానీ అతను ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భాగల్ పూర్ స్టేషన్‌ పట్టాలపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ స్టేషన్‌‌లో ఒక వ్యక్తి ఒక ఫ్లాట్ ఫామ్ నుంచి మరో ఫ్లాట్‌ఫామ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నప్పటికీ షార్ట్ కర్ట్ కోసం పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. 
 
పట్టాలపై ఉన్న రైలు కిందకు దూరగానే ఉన్నట్టుండి ట్రైన్ కదిలింది. దీంతో రైలు కింద చిక్కుకుపోయాడు. భయంతో పట్టాల కిందే వుండిపోయాడు. అతనిని చూసిన జనం షాకయ్యారు. రైలు దాటిన తర్వాత షాక్‌తో లేచి నిలబడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమీపంలో వున్న వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments