Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి ఆవును కొట్టిన వ్యక్తిని దూడ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసిందంటే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (14:14 IST)
Cow calf
మూగ జీవాలు పిల్లల్నీ కాపాడుకోవాలని తల్లి ఏ విధంగా పోరాడుతుందో, పిల్లలు కూడా తల్లి కోసం అలాగే చేస్తాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తల్లిని కొట్టిన ఓ వ్యక్తిని ఆవుదూడ ఎగరి ఓ తన్ను తన్నింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంతా నంద దీన్ని పోస్టు చేశారు. ఇది చూసిన నెటిజన్లు కర్మ అనుభవించక తప్పదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 
ఈ వీడియోలో ఓ డైరీ ఫాంలో ఆవుల గుంపు దగ్గరకు ఓ వ్యక్తి వెళ్లాడు. అక్కడ ఆవులను పక్కకు వెళ్లాలంటూ కర్ర తీసుకొని కొట్టాడు. హేయ్‌ హేయ్ అంటూ బెదిరించాడు. అంతలోనే ఆ పక్క నుంచి ఆవు దూడ పెరిగెత్తుకు వచ్చింది.
 
అంతేకాకుండా కోపంతో పైకి ఎగిరి వెనక కాళ్లతో బలంగా తన్నింది. అతడు వెనక్కి పేడలో పడిపోయాడు. దీంతో అతని తెల్ల చొక్కా కాస్తా పేడమయం అయింది. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లిపోయాడు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఇది చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments