Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BulletBandi పాటకు #NurseDance వీడియో వైరల్

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (15:57 IST)
Bullet song
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా అనే పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ పాటపై ఎవ్వరు డాన్స్ చేసిన విఫరీతమైన వ్యూస్ తో రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల పెళ్లి కూతురి డ్యాన్స్‌తో వైరల్ అయిన ఈ పాట ఓ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటు నుంచి ఎంతో మంది మహిళలు, అమ్మాయిలు ఈ పాటపై స్టెప్పులు వేస్తూ ఇరగీదీస్తున్నారు. దీంతో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ లోనూ ఊహించని వ్యూస్ వస్తున్నాయి.
 
ఫేస్ బుక్, వ్యాట్సాప్ స్టేటస్, ట్విట్టర్ అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ఇదే పాటతో మహిళలు తమదైన స్టైల్లో స్టెప్పులు వేస్తూ మురిసి పోతున్నారు. పాటలో మంచి మీనింగ్ ఉండటంతో చూసే వాళ్లు కూడా ఎంకరైజ్ చేస్తూ లైకులు, షేర్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ డుగ్గు డుగ్గు సాంగ్ పెళ్లి కూతురి డ్యాన్స్‌తో వైరల్ కాగా.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
ఓ ప్రభుత్వ హాస్పిటల్‌లో నర్సు ఈ పాటతో డాన్స్ చేసి ఆకట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున వేడుకలు ముగిశాక.. తోటి నర్సులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా నర్సు డాన్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆమె డాన్స్ చేస్తుండగా మిగతా నర్సులు చప్పట్లతో ఎంకరైజ్ చేశారు. 
 
ఈ సంఘటన ఎక్కడ జరిగింతో తెలియదు కానీ.. ఇప్పుడు ఈ పాట కూడా మరింత వైరల్ అవుతుంది. మొత్తానికి ఈ డుగ్గు డుగ్గు బుల్లెట్ స్పీడ్  ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. ఈ సాంగ్ పై డాన్స్ చేస్తూ మరెంత మంది కళాకారులు వెలుగులోకి వస్తారోనంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments