Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడు డాక్టరా? పశువా? పైశాచికత్వానికి పరాకాష్ట! (Video)

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (08:50 IST)
అతనో డాక్టర్. ఏ ప్రాణి అయిన ప్రాణాపాయ స్థితిలో ఉంటే తన శక్తిమేరకు ప్రాణం పోయాల్సిన వ్యక్తి. కానీ, పశువుగా మారిపోయాడు. తాను ఓ డాక్టర్ అనే ఇంగిత జ్ఞానాన్ని మరిచిపోయాడు. ఓ శునకాన్ని తాడుతో కారుకు కట్టేసి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాడు. ఆ కారు వేగానికి ఆ కుక్క పరుగెత్తలేక పోయింది. దీంతో కుక్క కాళ్లు కూడా విరగ్గొట్టుకుంది. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ నగరంలో జరిగింది.
 
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ డాక్టర్ చేసిన వెధవ పనిని ఓ బైకర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా, బైకర్ వేగం పెంచి కారుకు అడ్డంగా తన బైకును నిలిపి ఆ శునకాన్ని రక్షించాడు. 
 
ఈ వీడియోను డాగ్ హోం ఫౌండేషన్ అనే ఎన్.ఓ.జి సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేసింది. శునకాన్ని కుక్క మెడకు పొడవైన తాడు కట్టాడు. ఆ తాడును కారుకు కట్టి ఈడ్చుకెళుతున్న ఆ డాక్టర్‌ను రజనీష్ గల్వాగా గుర్తించారు ఈ  వీధి కుక్క తన ఇంటి వద్దే కాపు కాస్తుండటంతో దానిని వదిలించుకునేందుకు ఇలా చేసినట్టు రజనీష్ చెప్పాడు. అయితే, కారు వేగంతో ఆ శునకం పరుగెత్తలేకపోవడంతో పలు చోట్ల కాళ్లకు గాయాలైనట్టు తెలుస్తోంది. 
 
జోధ్‌పూర్ పోలీస్ కమిషనర్ ఈ ఘటనపై కఠిన చర్య తీసుకోవాలని, అతని లైసెన్సును కూడా రద్దు చేయాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థను, మేనకా గాంధీని ట్యాగ్ చేసింది. ఆ తర్వాత డాక్టర్‌పై జంతు హింస చట్టం కింద నమోదైన ఎఫ్.ఐ.ఆర్ కాపీని కూడా డాగ్ హోం ఫౌండేషన్ షేర్ చేసింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

కామెడీ చేసే నటులు దొరకడం ఇంకా కష్టం : సుందరకాండ డైరెక్టర్ వెంకటేష్

తెలీని కథతో అందరినీ ఆకట్టుకునేలా వుండేదే త్రిబాణధారి బార్బరిక్ : దర్శకుడు మోహన్ శ్రీవత్స

Kavya Thapar: నేను రెడీ హీరోయిన్ కావ్య థాపర్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments