Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిలకడగా కరుణానిధి ఆరోగ్యం... పరామర్శించిన వెంకయ్య

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆదివారం పరామర్శించారు. కరుణానిధి కుమారుడు ఎంకే.స్టాలిన్‌ని అడిగి ఆరోగ్య వివరాలను తెలుసుకున

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (15:55 IST)
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆదివారం పరామర్శించారు. కరుణానిధి కుమారుడు ఎంకే.స్టాలిన్‌ని అడిగి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
 
అలాగే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ కూడా కరుణానిధిని పరామర్శించారు. కాగా, కొన్నిరోజులుగా జ్వరం, మూత్రనాళం ఇన్ఫెక్షన్‌తో  కరుణానిధి బాధపడుతున్నారు. గత శుక్రవారం అర్థరాత్రి కరుణానిధికి రక్తపోటు ఒక్కసారిగా పడిపోవడంతో ఆయనను కావేరి ఆసుపత్రికి తరలించి, క్రిటికల్ కేర్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
మరోవైపు, కరుణానిధి ఆరోగ్యంపై కావేరీ ఆస్పత్రి ఎప్పటికపుడు వైద్య బులిటెన్‌ను విడుదల చేస్తోంది. అయినప్పటికీ డీఎంకే కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. కరుణ అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆసుపత్రికి తరలి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను కూడా రంగంలోకి దించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments