Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు షాక్... సైకిలెక్కనున్న వంగవీటి రాధా.. ముహూర్తం ఫిక్స్

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (10:38 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేత, స్థానికంగా మంచిపట్టున్న వంగవీటి రాధా షాకివ్వనున్నారు. ఈయన వైకాపాకు గుడ్‌బై చెప్పి.. సైకిలెక్కనున్నారు. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈనెల 25వ తేదీన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని టీడీపీ శ్రేణులు వెల్లడించాయి. 
 
సోమవారం రాత్రి కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కృష్ణా జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ ప్రయోజనాల కోసమే రాధాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. రాధాను కలుపుకుని వెళ్లాలని నేతలకు సూచించారు.
 
అదేసమయంలో వైసీపీకి రాజీనామా చేసిన రాధా సోమవారం రాధా-రంగా మిత్రమండలి సభ్యులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరడమే మంచిదన్న అభిప్రాయం సమావేశంలో వెల్లడైంది. దీంతో ఆయన టీడీపీలో చేరాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
 
అనంతరం జరిగిన రాధా-రంగా మిత్రమండలి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్‌పై పలు ఆరోపణలు చేశారు. జగన్ టికెట్లు అమ్ముకుంటున్నారని, అడిగినంత ఇవ్వలేదనే తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. అభిమానులు ఎవరూ వైసీపీకి ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments