Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాక్సిన్ వేయించుకున్న‌వారు బాహుబ‌లి

Webdunia
సోమవారం, 19 జులై 2021 (12:25 IST)
వ్యాక్సిన్ మీరు మీ బాహువుల‌కు వేయించుకోండి... అలా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న‌వారంతా బాహుబ‌లులే అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పార్ల‌మెంటు వ‌ర్షాకాలం స‌మావేశాలు ఢిల్లీలో ప్రారంభం అయ్యాయి. వాటి ప్రారంభానికి ముందు వ‌ర్షంలో గొడుగు ప‌ట్టుకుని మ‌రీ మీడియాతో మాట్లాడారు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.

బాహువుల‌కు తీసుకునే వ్యాక్సిన్ మ‌న‌ల్ని బాహుబ‌లుడిని చేస్తుంద‌ని, 40 కోట్ల మంది భార‌తీయులు ఇప్ప‌టికే బాహుబ‌లులుగా మారార‌ని ప్ర‌ధాని చెప్పారు. వారంతా ఇపుడు కోవిడ్ తో యుద్ధం చేసి, విజ‌యం సాధించార‌ని ప్ర‌ధాని వ్యాఖ్య‌నించారు. దేశంలో అత్యంత వేగంగా సాగుతున్న కోవిడ్ వ్యాక్సినేష‌న్ పై పార్ల‌మెంటులో సుదీర్ఘంగా చ‌ర్చించ‌నున్నామ‌ని ప్ర‌ధాని తెలిపారు.

కోవిడ్ అనంత‌రం పెండ‌మిక్ ప‌రిస్థితుల్లో ప్ర‌పంచం అంతా వైర‌స్ గుప్పిట్లో బంధీ అయిన అల్లాడుతోంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. దీనిని జ‌యించ‌డానికి కోవిడ్ వ్యాక్సిన్ ఒక‌టే మందు అని వివ‌రించారు. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని, కోవిడ్ మ‌హమ్మారిపై చేస్తున్న యుద్ధంలో అంద‌రూ విజ‌యం సాధించాల‌ని మోదీ ఆకాంక్షించారు.

భార‌తదేశం వంటి పెద్ద దేశంలో వ్యాక్సిన్ 40 కోట్ల భారతీయుల‌కు చేర‌డం ఒక మ‌హోద్య‌మ‌ని ప్ర‌ధాని వ‌ర్ణించారు. దీనిని పూర్తిగా దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా ఇచ్చేలా త‌మ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని, దీనిని అన్ని రాష్ట్రాల స‌హ‌కారం కూడా బాగుంద‌ని వివ‌రించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments