Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌కు టాటా చెప్పిన నటి ఊర్మిళా మదోండ్కర్

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (16:24 IST)
బాలీవుడ్ సినీ నటి ఊర్మిళా మదోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీలో జరుగుతున్న చిల్లర రాజకీయాలతో విసిగిపోయానని, అందుకే పార్టీ తప్పుకుంటున్నట్టు ఆమె ప్రకటించారు. 
 
కాగా, గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆ సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఉత్తర ముంబై లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమెపై బీజేపీ సీనియర్ నేత గోపాల్ శెట్టి విజయం సాధించారు. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ సైతం రాజీనామా చేసిన విషయం తెల్సిందే. అయన మార్గంలోనే పలువురు నేతలు తమతమ పదవులకు రాజీనామా చేశారు. 
 
ఈ క్రమంలో ఊర్మిళ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, రంగీలా, జుదాయి, మస్త్ వంటి బాలీవుడ్ సినిమాలతో పాటు పలు తెలుగు చిత్రాల్లో ఊర్మిళ నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రంగీలా చిత్రం ఆమె ఇమేజ్‌ను ఒక్కసారిగా పెంచిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments