Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో పవన్ కళ్యాణ్ భేష్... కేసీఆర్-జగన్ షాక్, ఎందుకు?

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (17:45 IST)
పవన్ కళ్యాణ్... టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ఓ పవర్ ఫుల్ పవర్ స్టార్. తెరపై కనబడితే ఫ్యాన్స్ ఊగిపోతారు. అదీ పవన్ కల్యాణ్ స్టామినా. ఐతే పొలిటిక్స్ విషయంలో అవినీతి లేని రాజకీయాలు చేస్తానని చెప్పిన జనసేనాని అదే దారిలో వెళ్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి పరాజయం పాలైనా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నవాడిని... ప్రజలకు నేనేంటో అర్థం కావాలి కదా అని చెప్పారు. 
 
సహజంగా కొందరు సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చాక పరాజయం చవిచూస్తే ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ముఖానికి రంగు వేసుకుని మళ్లీ తెరపైకి వచ్చేస్తారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం అలాక్కాదు. రాజకీయాలే శ్వాసగా ముందుకు వెళ్తున్నారు. ప్రజా సమస్యలు ఎక్కడుంటే జనసేనాని అక్కడే వుంటున్నారు. 
 
తాజాగా యురేనియం తవ్వకాలకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకున్నదంటూ వచ్చిన వార్తలపై ముందుగా గళమెత్తింది పవన్ కల్యాణే. ప్రజల్లో దీనిపై అవగాహన పెంచి అంతా మూకుమ్మడిగా కథం తొక్కేవిధంగా చేయడంలో సఫలీకృతుడయ్యారు. ఇపుడిదే రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటు వైకాపా అటు తెరాస చేయలేనిది జనసేన చేసిందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు పవన్ కల్యాణ్ ను ప్రశంసిస్తున్నారు. 
 
ప్రజలకు సమస్యలను సృష్టించే వాటిని ఎదుర్కోవడంలో జనసేనాని వ్యవహరించిన తీరు శభాష్ అని కొనియాడుతున్నారు. ఈ ప్రశంసలను చూసిన తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ ఒకింత ఆసక్తిని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారట. మొత్తమ్మీద రోజురోజుకీ జనసేన మెల్లిగా బలపడుతోందన్నమాటేగా.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments