Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ బైక్ ఇస్తానని అపాచి ఇచ్చారు.. బట్టలిప్పేసిన వరుడు.. వధువు ఏం చేసిందంటే?

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (15:21 IST)
బుల్లెట్ బైక్ ఇస్తానని అపాచి బైక్ ఇచ్చారని ఓ పెళ్లి కొడుకు పెళ్లి ఊరేగింపులో నానా హంగామా చేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. అడిగిన బైక్ అత్తింటివారు కట్నంగా ఇవ్వలేదని.. ఏకంగా గుర్రం ఎక్కి ఊరేగింపుగా వస్తున్న వరుడు గుర్రంపై నుంచి దూకేసి పెళ్లి డ్రెస్ విప్పేసి నానా హంగామా చేశాడు. యూపీలోని హత్రాస్ సిటీలో ఇది జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని హత్రాస్ పట్టణంలోని అమర్‌పురఘనా ప్రాంతంలో ఒక వరుడు పెళ్లి ఊరేగింపులో ఆగ్రహంతో ఊగిపోయాడు. కట్నం కింద ఇస్తామన్న బులెట్ బదులు అపాచి బైక్ ఇవ్వటంతో కోపంతో ఊగిపోయాడు. ఏకంగా పెళ్లి అలకరణంతో గుర్రం మీద ఊరేగింపుగా వస్తున్న సమయంలో గుర్రంపై నుంచి దూకేశాడు. అక్కడితో ఊరుకోకుండా.. పెళ్లి దుస్తులను విప్పేసి నానా హంగామా చేశాడు. అది చూసిన వధువు తరపువారు కంగారుపడిపోయారు. తర్వాత ఇస్తామని చెప్పి బతిమాలారు. కానీ అతను వినలేదు.
 
దీంతో ఈ విషయం కాస్తా పోలీసులకు తెలియటంతో సంఘటనా స్థలానికి చేరుకుని వరునితోపాటు అతని తండ్రి, బంధువులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ పెళ్లికి ముందే వీరు అసలు రూపం బైటపడింది. పెళ్లి తరువాత నా కూతుర్ని వేధించేవారిలా ఉన్న ఈ పెళ్లి మాకు వద్దని వధువు తండ్రి తేల్చి చెప్పేశాడు.
 
కేవలం బైక్ కోసం ఇంత రాద్దాతం చేసే ఇటువంటివాడికి నాకూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే తరువాత ఇంకెన్ని రకాలుగా వేధిస్తాడోనని భావించాడు. దీంతో ఈ పెళ్లి ఇష్టం లేదంటూ తేల్చిచెప్పేశాడు. వధువు కూడా తండ్రికి సపోర్ట్ చేసింది. నా తండ్రిని ఇంతగా అవమానించినవాడిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేసింది. ఫలితంగా కోపంతో ఊగిపోయిన వరుడికి అపాచి కాదు కదా.. సైకిల్ లేకుండా పోయింది. వరుడి హంగామాకు అతడి తరపు బంధువులు ఏమీ చేయలేక కామ్‌గా వారి వారి ఇళ్ళకు పోవాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments