డిక్లరేషన్‌పై జగన్ సంతకం చేస్తారా? చేయరా? 23న తిరుమలకు ఏపీ సీఎం!

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (16:19 IST)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం తిరుమల పర్యటనకురానున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 
 
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ తిరుమ‌ల ప‌ర్య‌ట‌నకు సంబంధించిన‌ ఏర్పాట్ల‌ను టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్‌వో గోపినాథ్‌జెట్టి ప‌రిశీలించారు. ఈ నేప‌థ్యంలో బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం నుండి శ్రీ‌వారి ఆల‌యం వ‌ర‌కు, నాద‌నీరాజ‌నం వేదిక వ‌ద్ద భ‌ద్ర‌త ఇత‌ర ఏర్పాట్లను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.
 
గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రులు వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి, కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్‌.య‌డ్యూర‌ప్ప నాద‌నీరాజ‌నం వేదిక‌పై సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో పాల్గొంటారు. వేదిక‌పై భ‌ద్ర‌త‌, అలంక‌ర‌ణ‌, కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల్సిన తీరుపై చ‌ర్చించారు. అనంత‌రం గోకులం విశ్రాంతి గృహంలోని స‌మావేశ మందిరంలో ఈ అంశంపై అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి టిటిడి అధికారులు, పండితుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. 
 
అయితే, తిరుమలకు వచ్చే సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివుంది. ఎందుకంటే.. సీఎం జగన్మోహన్ రెడ్డి క్రైస్తవమతాన్ని అనుసరిస్తున్నారు. దీంతో సీఎం జగన్ కూడా ఖచ్చితంగా డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనంటూ హిందూ ధార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. 
 
అయితే, ఈ వ్యవహారంపై ఏపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అదేసమయంలో తితిదే కూడా డిక్లరేషన్‌పై సీఎంపై ఒత్తిడి చేయరాదని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేస్తారా? లేదా? అన్నది ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments