Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవిడ్-19: అందుబాటులో ఉన్న కరోనా వైరస్ పాలసీలు

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (16:05 IST)
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భారతదేశంలో అదే పరిస్థితి. ప్రస్తుతం దేశంలో 51,18,253 నమోదు కాగా,  83,198 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టిల్ కేసుల సంఖ్య 10 లక్షలు. కేవలం భారతదేశం మాత్రమే కాదు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలో, ఇటలీలోనూ కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇటువంటి సమయంలో కరోనా వైరస్ చికిత్సకు కవరేజీ అందించే ఆరోగ్య బీమాను కలిగి ఉండటం అనేది అత్యవసరం.
 
కరోనా వైరస్- ఆరోగ్య బీమా పథకాలు
కరోనా వైరస్ చికిత్సకు కవరేజీ అందించేందుకు బీమా సంస్థలు పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇతర ఆరోగ్య బీమా పథకాల మాదిరిగానే ఈ పాలసీలు కూడా హాస్పిటలైజేషన్ ఖర్చులకు కవరేజీ అందిస్తాయి. అలాగే ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, అవుట్ పేషెంట్ ఖర్చులు, మందుల ఖర్చులు వంటి సమగ్ర కవరేజీని ఈ కరోనా వైరస్ ఆరోగ్య బీమా పాలసీలు అందిస్తాయి. ఇక్కడ గమనించాల్సి మరొక విషయం ఏమిటంటే కొవిడ్-19 ఆరోగ్య బీమా పథకాలు పిపిఈ కిట్ల ఖర్చుకు కూడా కవరేజీ అందిస్తాయి.
 
“ఆరోగ్య బీమా పథకాలు కొవిడ్-19 చికిత్సకు కవరేజీని అందిస్తాయి. అయితే కరోనా కవచ్ మరియు కరోనా రక్షక్ పాలసీలు ప్రత్యేకంగా కొవిడ్-19 కోసం రూపొందించబడ్డాయి. ఇవి పిపిఈ కిట్స్, మాస్క్ లు, గ్లౌజుల ఖర్చుతో పాటు, హెం ఐసోలేషన్, డయోగ్నొస్టిక్ ఖర్చులకు కూడా కవరేజీ అందిస్తాయి.”
 
అందుబాటులో ఉన్న కరోనా వైరస్ పాలసీలు
ఐఆర్డీఏఐ మార్గనిర్దేశకాల మేరకు ప్రత్యేకంగా కొవిడ్-19 కోసం బీమా సంస్థలు రెండు రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అవి,
1.కరోనా కవచ్
2.కరోనా రక్షక్
ఈ రెండు పాలసీలు కూడా స్టాండర్డ్ కొవిడ్-19 పాలసీలు. ఈ పాలసీల యొక్క నిబంధనలు ఇతర ఆరోగ్య బీమా పథకాల నిబంధనలను పోలి ఉంటాయి. ఈ పాలసీల గురించి తెలుసుకుందాం..
 
1.కరోనా కవచ్ బీమా పాలసీ
కరోనా కవచ్ అనేది స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ కింద హాస్పిటలైజేషన్ ఖర్చులు, హోం ఐసోలేషన్ ఖర్చులు, అంబులెన్స్ ఖర్చులు, పిపిఈ కిట్ల ఖర్చులు, మందుల ఖర్చులు, మాస్క్‌లు, గ్లౌజులు, ఐసియూ ఖర్చులకు కవరేజీ లభిస్తుంది. ఈ పథకం బీమా మొత్తం రూ. 50,000 దగ్గర నుంచి ప్రారంభమవుతుంది మరియు గరిష్టంగా రూ. 5 లక్షల వరకు కవరేజీ పొందవచ్చు. ఈ పథకం కుటుంబ సభ్యులకు కూడా రక్షణ కల్పించవచ్చు. అలాగే ఆయుష్ చికిత్సా విధానాలకు కూడా ఈ పథకం కవరేజీ అందిస్తుంది.
 
ఈ పాలసీ కింద ఆప్షనల్ కవర్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది. కొవిడ్-19 చికిత్స కోసం పాలసీదారుడు 24 గంటల కంటే ఎక్కువ సేపు ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రి నగదు ప్రయోజనం కింద బీమా మొత్తంలో 0.5 శాతం రోజువారీ నగదు కింద అందించబడుతుంది. ఇది గరిష్టంగా 15 రోజుల వరకు చెల్లించబడుతుంది.
 
“ఇప్పటికే ఆరోగ్య బీమా కలిగి ఉండి మరియు ఆరోగ్య బీమా మొత్తం తక్కువగా ఉన్నట్లయితే కరోనా కవచ్ పాలసీని ఎంచుకోవచ్చు.  ఈ కరోనా కవచ్ పాలసీ కింద సమగ్ర కవరేజీ లభిస్తుంది. ఇప్పటి వరకు ఆరోగ్య కలిగి ఉండకపోతే, కరోనా కవచ్ పాలసీని కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే కరోనా కవచ్ పాలసీ కింద మొత్తం కుటుంబానికి రక్షణ కల్పించవచ్చు.”
 
2.కరోనా రక్షక్ పాలసీ
కరోనా రక్షక్ పాలసీ, పాలసీదారుడు కొవిడ్-19 చికిత్స కోసం 72 గంటల కన్నా ఎక్కువ సేపు ఆసుపత్రిలో ఉన్నట్లయితే, బీమా మొత్తం ఒకేసారి అందించబడుతుంది. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. అలాగే బీమా మొత్తం కనిష్టంగా రూ.50 వేల నుంచి, గరిష్టంగా 2.5 లక్షలు వరకు ఎంచుకోవచ్చు.
 
“ఆరోగ్య బీమా కలిగి ఉండి మరియు కొవిడ్-19 కారణంగా రోజువారీ ఆదాయాన్ని కొల్పోతే కరోనా రక్షక్ పాలసీని ఎంచుకోవడం మంచిది. పాలసీదారునికి కొవిడ్-19 నిర్థారణ అయితే, ఈ పాలసీ కింద ఒకే సారి బీమా మొత్తం చెల్లించబడుతుంది. ఈ పాలసీ వ్యక్తిగతంగా మాత్రమే కవరేజీ అందిస్తుంది. కుటుంబ ఫ్లోటర్ విధానం అందుబాటులో లేదు.”
 
కరోనా కవచ్ మరియు కరోనా రక్షక్ పాలసీల మధ్య  తేడాలు
ఫీచర్లు కరోనా కవచ్ కరోనా రక్షక్
కవరేజీ రకం స్టాండర్డ్ ప్రయోజన ఆధారిత
బీమా మొత్తం రూ. 50,000 నుంచి రూ. 5 లక్షల వరకు రూ. 50,000 నుంచి రూ 2,50,00 వరకూ
ప్రీమియం చెల్లింపు సింగిల్ ప్రీమియం సింగిల్ ప్రీమియం
హాస్పిటలైజేషన్ 24 గంటలు 72 గంటలు
యాడ్-ఆన్స్ రోజువారీ ఆసుపత్రి నగదు -
వెయిటింగ్ పీరియడ్ 15 రోజులు 15 రోజులు
     
 
పాలసీ ప్రీమియం రేట్లలలో తేడాలు..
కరోనా కవచ్ మరియు కరోనా రక్షక్ ప్రీమియం రేట్లు భిన్నంగా ఉంటాయి. రెండు రకాల పాలసీలు ప్రామాణిక ఉత్పత్తులు అయినప్పటికీ, పాలసీ ప్రీమియం అనేది బీమా సంస్థ నుంచి బీమా సంస్థకు మారుతూ ఉంటుంది. బీమా సంస్థలకు పాలసీ ధరను నిర్ణయించడానికి అనుమతి ఉంది.
 
“క్లైయిమ్ నిష్పత్తులు మొదలైన వాటి అంచనాల ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి. ప్రతి బీమా సంస్థ యొక్క యాక్చురియల్ బృందం యొక్క అంచనాలు వేరువేరుగా ఉంటాయి. అందువల్లే ప్రీమియం రేట్లు భిన్నంగా ఉంటాయి. అలాగే బీమా సంస్థలు అందించే సేవల నాణ్యతను బట్టి కూడా ధర భిన్నంగా ఉంటుంది.”
 
ఇతర రకాల కొవిడ్-19 బీమా పథకాలు
కరోనా కవచ్ మరియు కరోనా రక్షక్ పాలసీలు మాత్రమే కాకుండా, చాలా బీమా సంస్థలు ఇతర పాలసీలను కూడా ప్రారంభించాయి. ఇవి నీడ్-బేస్డ్ పాలసీలు. ఐఆర్డీఏఐ శాండ్ బాక్స్ నిబంధనల ప్రకారం బీమా సంస్థలు పరిమిత కాలానికి ఈ పాలసీలను విక్రయించడానికి అనుమతి ఉంది. ఈ పాలసీలు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష కవరేజీ అందిస్తాయి. ఉదాహరణకు స్టార్ నావల్ కరోనా వైరస్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇది రూ. 21,000 మరియు రూ. 42 వేల విలువ కలిగిన రెండు బీమా ఎంపికలను అందిస్తోంది.
 
కరోనా రక్షక్ మరియు కరోనా కవచ్ కవరేజీ అందించే అంశాలు
కరోనా కవచ్ మరియు కరోనా రక్షక్ రెండూ  కూడా భిన్నమైన పాలసీలు.  ఈ పాలసీలు విభిన్న అంశాలకు కవరేజీ అందిస్తాయి. కరోనా రక్షక్, కరోనా కవచ్ అందించే ప్రాథమిక కవరేజీ అంశాలు కింద పట్టికలో ఉన్నాయి.
 
కొవిడ్-19 హాస్పిటలైజేషన్ ఖర్చులు
1. ఆసుపత్రి గది అద్దె, బోర్డింగ్ మరియు నర్సింగ్ ఛార్జీలు.
2. కన్సల్టెంట్, స్పెషలిస్ట్, సర్జన్ ఖర్చులు.
3. రక్తం, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్, శస్త్రచికిత్సా పరికరాలు, వెంటిలేటర్, మందుల ఖర్చులు.
4. డయాగ్నోస్టిక్స్, పిపిఈ కిట్స్, మాస్క్ లు, గ్లౌజులు మరియు ఇతర అనుబంధ ఖర్చులు.
5. ఐసియూ ఖర్చులు.
6. అంబులెన్స్ ఖర్చులు(గరిష్టంగా రూ. 2000)
 
హోం కేర్ ఐసోలేషన్ ఖర్చులు
1. గరిష్టంగా 14 రోజుల వరకు అయ్యే ఖర్చులకు కవరేజీ అందించబడుతుంది.
2. వైద్యునిచే సూచించబడిన మందుల ఖర్చులు(ప్రిస్కిప్షన్).
3. ఇంటి వద్ద లేదా డయాగ్నోస్టిక్ సెంటర్ లో నిర్వహించే డయాగ్నోస్టిక్ ఖర్చులు.
4. కన్సల్టేషన్ ఛార్జీలు.
5. నర్సింగ్ ఛార్జీలు
6. ఆక్సిజన్ సిలిండర్, ఆక్సోమీటర్ మరియు నెబ్యూలైజర్ ఖర్చులు.
7. ఆయుష్ చికిత్స, ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు కూడా పాలసీ కవరేజీ అందిస్తుంది.
 
కరోనా రక్షక్ కవరేజీ
*పాలసీదారుడు కొవిడ్-19 పాజిటివ్ నిర్థారణ అయితే పాలసీ మొత్తం 100 శాతం చెల్లించబడుతుంది. అయితే 72 గంటలు హాస్పిటలైజేషన్ అయి ఉండాలి.
*కొవిడే-19 కింద ఆసుపత్రిలో చేరినప్పుడు ఆసుపత్రి ఖర్చులతో సంబంధం లేకుండా పాలసీ మొత్తం చెల్లించబడుతుంది.
 
కరోనా కవచ్& కరోనా రక్షక్ పాలసీల యొక్క ప్రయోజనాలు
* పిపిఈ కిట్లు, మాస్క్ లు, గ్లౌజులు, ఆక్సిజన్, వెంటిలేటర్ మరియు డయాగ్సోస్టిక్ ఖర్చులకు కరోనా కవచ్ పాలసీ కింద సమగ్ర కవరేజీ లభిస్తుంది.
* కరోనా కవచ్ పాలసీ కింద ఐసీయూ చికిత్సకు పూర్తి కవరేజీ లభిస్తుంది.
* అంబులెన్స్ ఛార్జీలు గరిష్టంగా రూ. 2000 వరకు అందించబడతాయి.
* నర్సింగ్, ఆసుపత్రి గది అద్దె కు కవరేజీ లభిస్తుంది.
* 14 రోజుల పాటు హెం ఐసోలేషన్‌కు కవరేజీ లభిస్తుంది.
* ఆయుష్ చికిత్స విధానానికి కూడా కవరేజీ అందుబాటులో ఉంది.
* ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్‌కు కవరేజీ.
* కరోనా కవచ్ పాలసీ కింద ఐచ్ఛిక కవర్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే, రోజువారీ ఆసుపత్రి నగదు కింద బీమా మొత్తంలో 0.5 శాతం లభిస్తుంది.
 
“పాలసీ కొనుగోలు చేసే ముందు, పాలసీ యొక్క కవరేజీ, వెయిటింగ్ పిరియడ్ పరిశీలించాలి. అలాగే వినియోగదారుడు తమ అవసరాలను బేరీజు వేసుకుని బీమా మొత్తాన్ని ఎంచుకోవాలి.  ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని పాలసీ కొనుగోలు చేస్తే తక్కువ ప్రీమియం లోనే సమగ్ర కవరేజీ అందించే పాలసీని వినియోగదారుడు ఎంచుకోవచ్చు.”
 
కొవిడ్-19 బీమా కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సి విషయాలు
బీమా మొత్తం- కరోనా కవచ్ కింద లభించే గరిష్ట బీమా మొత్తం రూ. 5 లక్షలు కాగా, కరోనా రక్షక్ పాలసీ కింద లభించే గరిష్ట బీమా మొత్తం రూ. 2.5 లక్షలు. ఈ పాలసీలు ఇంతకంటే ఎక్కువ కవరేజీ అందించవు.
 
కవరేజీ- పాలసీ కొనుగోలు చేసే ముందు, పాలసీ అందించే కవరేజీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే అవసరాలకు అనుగుణంగా ఉత్తమ పాలసీని ఎంచుకోవాలి. వెయిటింగ్ పిరియడ్- చాలా ఆరోగ్య బీమా పథకాలు ముందుగా ఉన్న వ్యాధులకు వెయిటింగ్ పిరయడ్ పూర్తి అయిన తర్వాత మాత్రమే కవరేజీని అందిస్తాయి. ఈ వెయిటింగ్ గరిష్టంగా 48 నెలల వరకు ఉంటుంది. కొవిడ్-19 పాలసీలకు కూడా 15 రోజుల వెయిటింగ్ పిరియడ్ ఉంది.
 
గుర్తింపు పొందని డయాగ్నోస్టిక్ సెంటర్- పాలసీదారుడు కొవిడ్-19 పరీక్షను గుర్తింపు పొందని డయాగ్నొస్టిక్ సెంటర్ ద్వారా నిర్వహించబడితే పాలసీలు ఎటువంటి కవరేజీ అందించవు. క్లైయిమ్ వెయిటింగ్ పిరియడ్- ఒక వేళ పాలసీ కొనుగోలు చేసిన 15 రోజుల్లోపు క్లైయిమ్ దాఖలు చేస్తే, క్లైయిమ్ తిరస్కరణకు గురవుతుంది.
 
హోం క్వారంటైన్ ఖర్చులు- హోం క్వారంటైన్ ఖర్చులకు పాలసీ ఎలాంటి కవరేజీ అందించదు. ముందుగా ఉన్న వ్యాధులకు కవరేజీ- ముందుగా ఉన్న వ్యాధుల చికిత్స కోసం వెయిటింగ్ పిరియడ్ ముగియకపోతే పాలసీ ఎలాంటి కవరేజీ అందించదు. వైద్యుడి రిఫరల్ లేకుండా ఆసుపత్రిలో చేరడం- గుర్తింపు పొందిన వైద్యుని రిఫరల్ లేకుండా మీరు ఆసుపత్రిలో చేరితే, ఈ పాలసీ ఆసుపత్రి ఖర్చులకు కవరేజీ అందించదు.
 
కరోనా కవచ్, కరోనా రక్షక్ మరియు కొవిడ్- 19 పాలసీల మధ్య వత్యాసం
* కరోనా కవచ్ మరియు కరోనా రక్షక్ పాలసీలు అన్ని బీమా సంస్థలు ఒకే పాలసీ వ్యవధిని కలిగి ఉంటాయి. ఇతర కరోనా వైరస్ పాలసీల కాల వ్యవధి  సంస్థ నుంచి సంస్థకు మారుతూ ఉంటుంది.
 
* కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీ నిర్ధిష్ట కాలానికి జారీ చేయబడతాయి, ఇతర కరోనా వైరస్(నీడ్ బేస్డ్) పాలసీలను బీమా సంస్థలు ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.
 
* కరోనా కవచ్ మరియు రక్షక్ పాలసీలో గరిష్ట, కనిష్ట బీమా మొత్తాలు ఫిక్స్డ్ అయి ఉంటాయి. మిగతా కరోనా వైరస్ పాలసీల్లో ఇది బీమా సంస్థను బట్టి మారుతూ ఉంటుంది.
 
-నవల్ గోయల్(సీఈవో, PolicyX.com)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments