Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయంలో ట్రాన్స్‌జెండర్‌‌తో పెళ్లికి రైల్వే ఉద్యోగి యత్నం... ఏమైందంటే?

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (18:50 IST)
తూత్తుకుడికి చెందిన ఓ రైల్వే ఉద్యోగి ఓ ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లాడటం వివాదాస్పదమైంది. అదీ ఆలయంలో హిజ్రా వివాహం అట్టహాసంగా జరగడంతో ఆలయ నిర్వాహకులు చేసేదిలేక తలపట్టుకున్నారు.


వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడికి చెందిన బీఈ స్టూడెంట్ అరుణ్ కుమార్ రైల్వేలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతను ట్రాన్స్‌జెండర్‌ అయిన శ్రీజాతో ఆరేళ్ల పాటు ప్రేమలో వున్నాడు. శ్రీజా ఓ ప్రైవేట్ కాలేజీలో బీఏ చదువుతోంది. కానీ వీరి ప్రేమ గురించి తెలుసుకున్న అరుణ్ కుమార్ బంధువులు.. వారి వివాహాన్ని వ్యతిరేకించారు. 
 
అయితే శ్రీజాపై గల ప్రేమతో అరుణ్ కుమార్ తల్లిదండ్రులకు దూరమై ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ మేరకు బుధవారం తూత్తుకుడి ఆలయంలో వివాహం చేసుకున్నారు. కానీ వీరి పెళ్లికి ఆలయ నిర్వాహకులు కూడా నో చెప్పారు.

చట్టం ప్రకారం ఓ స్త్రీని పురుషుడు వివాహం చేసుకునేందుకు ఆలయం అనుమతిస్తుందని.. కానీ ట్రాన్స్‌జెండర్‌ను ఓ పురుషుడు పెళ్లాడేందుకు అనుమతించమని ఆలయ నిర్వాహకులు తేల్చి చెప్పారు. దీంతో అరుణ్ కుమార్ స్నేహితులు, ఆలయ నిర్వాహకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 
 
కానీ ముహూర్తం సమయం దాటకముందే శ్రీజా మెడలో అరుణ్ కుమార్ మూడు ముళ్లు వేశాడు. వివాహ ధ్రువీకరణ పత్రాన్ని త్వరలోనే పొందుతామని.. అరుణ్ కుమార్, శ్రీజా దంపతులు వెల్లడించారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు బంధువులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments