Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్క పోస్ట్ చేసిన ఆ ఫోటోకు అర్థం వేరు.. క్లారిటీ ఇచ్చేసిన దేవసేన

Advertiesment
అనుష్క పోస్ట్ చేసిన ఆ ఫోటోకు అర్థం వేరు.. క్లారిటీ ఇచ్చేసిన దేవసేన
, మంగళవారం, 30 అక్టోబరు 2018 (15:26 IST)
దాదాపు అగ్ర హీరోలందరితో నటించి, ఎన్నో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ మన స్వీటీ. అనుష్క బయట ప్రవర్తించే తీరు, ఆమె మంచితనం, అభినయం ఎంతో మంది అభిమానులను పొందేలా చేసింది. మొన్నటివరకు డార్లింగ్ ప్రభాస్‌తో పెళ్లి అంటూ వచ్చిన రూమర్లకు ఈ మధ్యనే ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఇక డార్లింగ్‌కు కూడా ఏడాదిలోపు పెళ్లి చేసేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయట.
 
తాజాగా అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటో పోస్ట్ చేసింది. దానికి "నో క్యాప్షన్ రిక్వైర్డ్" అని కూడా వ్రాసింది. అయితే ఈ ఫోటోలు పచ్చని చెట్ల మధ్య ఒక పాదం ఉంది. అది అనుష్క పాదమే అని చూస్తే అర్థమయిపోతోంది. అందులో ప్రత్యేకత ఏమిటంటే బొటనవేలి పక్క వేలి మీదుగా మూడు ఆకులతో ఒక తీగ ఉంది. ఇది ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇక అభిమానులు ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఊహించేసుకుంటున్నారు.
 
అనుష్కకు త్వరలో పెళ్లి జరగబోతున్నట్లు, అందుకే ముందస్తుగా ఈ ఫోటో పోస్ట్ చేసినట్లు భావిస్తున్నారు. ఖాళీగా ఉన్న పాదం పారాణితో దర్శనమివ్వనుందని ఆశిస్తున్నారు. ఇక మూడు ఆకులు ఉన్న తీగను కాలికి పెట్టుకునే మెట్టెలుగా ఊహించుకుంటూ తన పెళ్లిపై హింట్ ఇచ్చిందని భావిస్తున్నారు అభిమానులు. 
 
కొంతమంది మరింత ముందుకెళ్లి కంగ్రాట్స్ అంటూ విష్ చేయగా, మరికొంత మంది పెళ్లైనా కూడా సినిమాలలో కొనసాగాలంటూ విన్నవించుకున్నారు. అయితే ఈ ఫోటోపై అనుష్క శెట్టి వివరణ ఇచ్చింది. ఈ ఫోటోకి తన పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది అనుష్క. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ తన శరీర బరువు తగ్గించుకోవడం కోసం నార్వేలోని ఓ ప్రకృతి వైద్యశాలలో చేరింది. అక్కడ నాచురోపతి ట్రీట్మెంట్ ద్వారా బరువు తగ్గిస్తారు.
 
దట్టమైన అడవుల్లో ఉండే ఈ వైద్యశాలలో ఖాళీ సమయాల్లో సరదాగా తిరుగుతూ ఉండగా.. ఆమె కాలికి తగిలిన తీగను ఫోటో తీసి పోస్ట్ చేసిందట. ఇది చూసిన అభిమానులు అనుష్క పెళ్లికి సిద్ధమని భావించారు. అయితే అవన్నీ ఉత్తుత్తివేనని అనుష్క క్లారిటీ ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుస ఫ్లాప్‌లు ఉన్నా... నిర్మాతలు క్యూ కడుతున్నారు.. ఎందుకని?