Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్యూటీకి వెళ్ళొద్దు నాన్న.. నాతో ఆడుకో.. పోలీస్ ఐతే ఇంతే? (వీడియో వైరల్)

police
Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (15:15 IST)
పోలీసు ఉద్యోగం అంటేనే తీరిక వుండదు. 24 గంటలు డ్యూటీల కంటూ తిరగాల్సి వుంటుంది. రాత్రి, పగలు లేకుండా పోలీసులు డ్యూటీలు చేస్తుంటారు. అలాంటి వారికి కుటుంబీకులను పట్టించుకునే సమయం కూడా వుండదు. ఇంకా పోలీసులకు చిన్ని వయస్సులో పిల్లలుంటే వారితో గడిపే సమయం చాలా తక్కువగా వుంటుంది. ఇలా కుటుంబం, పిల్లలతో గడపలేక ఎందరో పోలీసులు డ్యూటీ చుట్టూ తిరుగుతున్నారు. 
 
ఇలా డ్యూటీ అంటూ వెళ్తూ.. తనకు దూరంగా వుంటున్న తండ్రిని డ్యూటీకి వెళ్లకుండా అడ్డుకున్నాడు.. ఈ బుజ్జిగాడు. తండ్రి కాళ్లు పట్టుకుని డ్యూటీ వెళ్ళొద్దని గట్టిగా ఏడుపు లగించుకున్నాడు. డ్యూటీకి వెళ్లి త్వరగా వచ్చేస్తానని.. అంతవరకు ఆడుకోమని తండ్రి చెప్తున్నా.. ఆ పిల్లాడు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తండ్రి కాలు పట్టుకుని వదల్లేదు. 
 
తనతో ఎక్కువ సమయం ఉండడంలేదని ఎన్నాళ్లగానో వేదన చెందుతున్నఆ కొడుకు.. ఇంటికి వచ్చిన తండ్రి మళ్లీ డ్యూటీకి రెడీ అయి వెళుతుండగా అడ్డుకున్నాడు. ఇంట్లో తనతోనే ఉండి ఆడుకోవాలంటూ తండ్రిని గట్టిగా పట్టుకుని ఏడ్చాడు. ఏడుస్తున్న కొడుకును సముదాయించలేక, ఆఫీసుకు వెళ్లలేక ఆ పోలీసు తండ్రి పడ్డ వేదనను మాటల్లో చెప్పలేం. 
 
ఒక నిముషం 20 సెకన్లు ఉన్న ఈ వీడియో హృదయాన్ని కదిలిస్తుందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా పోలీసుల కష్టాలను తెలియజేసేలా ఈ వీడియో వుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా తన తండ్రితో గడపాలని ఆ చిన్నారి ఏడ్వడం కలచి వేస్తోందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలా తన కొడుకు ఎంత మారం చేస్తున్నా.. సముదాయించి డ్యూటీకి వెళుతున్న పోలీసుకు నెటిజన్లు సలాం కొడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

Ustad: పవన్ కళ్యాణ్ చే ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments