ఓ వ్యక్తి చెవిలో సాలెపురుగు.. హాయిగా వలకట్టుకుని జీవించింది.. (వీడియో)

Webdunia
సోమవారం, 13 మే 2019 (10:55 IST)
చైనాలో ఓ వ్యక్తి చెవిలో సాలెపురుగు వల కట్టుకుని సంతోషంగా జీవించింది. అయితే చెవిలో సాలెపురుగు వుందని తెలియని ఆ వ్యక్తి నరకయాతన అనుభవించాడు. అయితే వైద్యులు సంప్రదించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ విషయం తెలుసుకున్న వైద్యులు షాకయ్యారు. వివరాల్లోకి వెళితే.. చైనాలోని జియాంజూ ప్రావిన్స్‌లో లీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి కొద్దిరోజుల నుంచి చెవిపోటుతో బాధపడుతున్నాడు. చెవి నొప్పితో పాటు మంట కూడా ఏర్పడింది. ఇంకా దురద కూడా కలిగేది. 
 
చెవిలో వున్న డస్ట్ వల్లే ఇదంతా జరుగుతుందని.. అతను మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ చెవిపోటు ఎక్కువ కావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతనిని పరిశోధించిన వైద్యులు షాక్ తిన్నారు. మైక్రోస్కోప్ ద్వారా చెవిని పరిశోధించిన వైద్యులు అతని చెవిలో స్పైడర్ వల కట్టిన విషయాన్ని తెలుసుకున్నారు. ఆపై ఉప్పు కలిపిన నీటిని చెవిలో పోసి.. సాలె పురుగును ప్రాణాలతో బయటికి తీశారు. 
 
ఆపై లీకి చెవిపోటు తగ్గింది. హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో లీ చెవిలో సాలెపురుగు వున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు ఓ లుక్కేయండి.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments