రైలులో ఇఫ్తార్ విందు - రైల్వే శాఖపై ప్రశంసల వర్షం

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (18:03 IST)
ముస్లిం సోదరులు పవిత్ర పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ నెలలో ప్రతి ఒక్క ముస్లిం రంజాన్ ఉపవాసం ఉంటారు. అలాగే, ముస్లిం సోదరుల కోసం అనేక సంస్థలు, ప్రభుత్వాలు ఇఫ్తార్ విందులను ఇస్తుంటాయి. అయితే, ఇపుడు ఈ తరహా ఇఫ్తార్ విందును రైల్వే శాఖ కూడా ఏర్పాటు చేసింది. దీంతో రైల్వే శాఖపై ప్రశంసల వర్షం కురుస్తుంది. 
 
దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా గుర్తింపు పొందిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లై రైల్వే శాఖ ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ రైలులో ప్రయాణించే ముస్లిం ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా భోజనం అందజేసింది. ఈ మీల్స్‌ను ఓ ముస్లిం సోదరుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను చూసిన యూజర్లు రైల్వే శాఖపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
షా నవాజ్ అక్తర్ అనే వ్యక్తి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో ఇటీవల ప్రయాణించారు. ఆయనకు టీ కావాలని, కానీ ఉపవాసం కావడం వల్ల కొంచెం ఆలస్యంగా తీసుకు రమ్మని ప్యాంట్రీ సిబ్బందికి విన్నవించారు. కానీ, ప్యాంట్రీ సిబ్బంది మాత్రం ఇఫ్తార్ విందు తీసుకొచ్చి ఆశ్చర్యపరిచారని చెప్పారు. దీంతో తెగ ఆనందపడిపోయిన అక్తర్ ఆ విషయాన్ని ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments