Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ ఆవిధంగా ముందుకు పోతున్నారు

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (22:40 IST)
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయంలో శనివారం ముంబైలో విచారించారు.
 
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకునే చెప్పిన సమాధానాలకు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఆమెను రెండోసారి సమన్లు ఇవ్వమని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం నలుగురు హీరోయిన్లను ప్రశ్నించామని అధికారులు తెలిపారు. శనివారం నలుగురి స్టేట్మెంట్‌లను రికార్డ్ చేశామని అన్నారు. సారా ఆలీఖాన్, శ్రద్దా కపూర్‌లను రెండు కేసుల్లో ప్రశ్నించామని అధికారులు పేర్కొన్నారు.
ఇక కరణ్ జోహార్‌కు ఈ కేసుతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేశామని ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు. కేవలం దీపిక చాటింగ్‌ను మాత్రమే పరిశీలించామని సుశాంత్ కేసు ఆధారంగానే వీరిని ప్రశ్నించామని పేర్కొన్నారు. 
 
రియా చక్రవర్తి సారా అలీ ఖాన్, శ్రద్దా కపూర్ పేర్లు చెప్పిందని, కానీ విచారణలో మాత్రం వారిద్దరూ డ్రగ్స్ వాడలేదని తెలిపారని చెప్పారు. ఈ కేసులో ధర్మా ప్రొడక్షన్‌కు చెందిన క్షితిస్ ప్రసాద్‌ను అరెస్ట్ చేశామని అధికారులు ప్రకటించారు.
ఇకపోతే.. ఈ విచారణలో పలు కీలక విషయాల్ని దీపిక వెల్లడించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తన మేనేజర్ కరిష్మాతో 2017లో జరిపిన వాట్సాప్ ఛాటింగ్స్ తనవేనని దీపిక అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే డ్రగ్స్ మాత్రం ఎప్పుడూ తీసుకోలేదని తెలిపిందట. 
 
దాదాపు ఇవే రకమైన ప్రశ్నల్మి మిగతా ఇద్దరు హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ ఎదుర్కొన్నారు. సుశాంత్‌తో తాము పార్టీలకు హాజరైన విషయాన్ని వీళ్లు అంగీకరించారు. అయితే అక్కడ మాదకద్రవ్యాలు సేవించలేదని వీళ్లు అధికారులకు తెలియజేశారు.
 
ప్రస్తుతానికి వీళ్ల ముగ్గుర్ని ఇంటికి పంపించిన అధికారులు.. మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వీళ్లలో దీపిక చెప్పిన సమాధానాలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేయలేదంటూ జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments