Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ డెడ్ అని చెప్పిందక్కడే, దివ్యభారతి... (video)

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (13:08 IST)
సుశాంత్ సింగ్-దివ్యభారతి
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసిన దురదృష్ట ఘటన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య. అతడు తీవ్రమైన ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడని తేలింది. ఆ తర్వాత సుశాంత్ మరణానికి వాళ్లు కారణం, వీళ్లు కారణం అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేగింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.
 
ఇదిలావుంటే మరో వార్త హల్చల్ చేస్తోంది. అదేమిటంటే.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కారణంగా చనిపోయాడంటూ తేల్చింది ముంబైలోని కూపర్ ఆస్పత్రిలో. ఐతే ఇదే ఆసుపత్రికి ఇంతకుముందు ఇద్దర నటీమణులను తీసుకురావడం వారు అప్పటికే చనిపోయారని నిర్థారించడం జరిగింది.
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో తిష్టవేసిన దివ్యభారతిని 1993 ఏప్రిల్ 5న ఇదే కూపర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమె తన ఐదో అంతస్తు ఇంట్లో బాల్కనీ కిటికీ నుంచి కిందపడింది. దానితో తీవ్రమైన గాయాలు కావడంతో ఆమెను హుటాహుటిన కూపర్ ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఆమె మరణించినట్లు కూపర్ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. ఏప్రిల్ 7న ఆమె అంత్యక్రియలు జరిగాయి.
 
మరో నటి పర్వీన్ బేబి 2005 జనవరి 5న తన ఇంట్లో విగతజీవిగా పడి వుంది. ఆమె మృతదేహాన్ని ముంబైలోని కూపర్ ఆస్పత్రికి తరలించగా ఆమె చనిపోయి కనీసం 72 గంటలు అయి వుంటుందని పోస్టుమార్టం రిపోర్టులో తేల్చారు. కాగా పర్వీన్ మధుమేహం వ్యాధితో బాధపడుతూ వుండేది. వ్యాధి తీవ్రమవడంతో వీల్ ఛైర్ కే పరిమితమైంది. చివరి రోజుల్లో ఆమెను పట్టించుకునేవారే కరవయ్యారు. ఫలితంగా ఆమె మరణించినదని తెలుసుకునేందుకు 72 గంటలు పట్టింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments