Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

సెల్వి
శనివారం, 7 జూన్ 2025 (09:12 IST)
ప్రముఖ నటుడు సోనూ సూద్‌ జూన్ రెండో తేదీన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదటిసారిగా 25 ఏండ్ల క్రితం శ్రీవారిని దర్శించుకున్నానన్నారు.

మళ్లీ ఇప్పుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చానన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారి ప్రార్థించానని చెప్పారు. నంది పేరుతో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నామని, అందులో తాను నటిండటంతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నానని వెల్లడించారు.
 
అలాగే సోనూసూద్ తిరుమలలో ఓ చిరు వ్యాపారిని కలిశారు. తిరుమల తిరుగు ప్రయాణంలో సోనూసూద్.. తిరుపతిలో తట్టపైన బేల్ పూరి విక్రయిస్తున్న చిరువ్యాపారి జ్యోతితో ముచ్చటించారు.

కుటుంబ విషయాలు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గత 25 సంవత్సరాలుగా భేల్ పూరి విక్రయిస్తున్నానని సోనూ సూద్‌తో జ్యోతి  చెప్పారు. ఓ సాధారణ వ్యక్తిలా బేల్ పూరి కొనుగోలు చేసి జ్యోతితో కాసేపు ముచ్చటించిన సోనూ సూద్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by It'sMyTirupati (@itsmytirupati)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya :సూర్య, వెంకీ అట్లూరి చిత్రం‘విశ్వనాథ్ & సన్స్ కు స్వాతంత్య్రం

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

తర్వాతి కథనం
Show comments