చివరి దాకా తామే గెలుస్తామన్న ధీమాతో ముందుకు సాగిన పాకిస్తాన్ జట్టుకు టి-20 సెమీఫైనల్లో భంగపాటు ఎదురైన సంగతి తెలిసిందే. ఆ షాక్ దెబ్బకి పాకిస్తాన్ దేశంలో చాలామంది క్రీడాభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా షేర్ అవుతున్నాయి.
ఇదిలావుంటే ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడాక పాకిస్తాన్ జట్టు డ్రెస్సింగ్ రూములోకి వెళ్లింది. అక్కడ అంతా మౌనముద్రలో మునిగిపోయారు. అలా చేసి వుంటే గెలిచేవాళ్లం, ఇలా చేసి వుంటే గెలిచేవాళ్లం అనే చర్చ మామూలే. ఇలాంటి చర్చలను ఇక చేయవద్దని కెప్టెన్ బాబర్ జట్టు సభ్యులతో చెప్పాడు. జట్టును ఉత్సాహపరుస్తూ మాట్లాడాడు.