Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృత కోసం ఆ పని చేయడానికి సిద్ధమైన సమంత..?

నిజ జీవితం ఆధారంగా కొన్ని సినిమాలను తెరకెక్కించడం. కొన్ని సినిమాల నుంచి స్ఫూర్తి పొంది నిజజీవితంలో అదే తరహాలో కొన్ని పనులు చేయడం వంటివి సమాజంలో జరుగుతున్న విషయం తెలిసిందే. అంతిమ తీర్పు సినిమాను స్ఫూర్తిగా తీసుకుని తాను పరిటాల రవిని హత్య చేశానని మొద్

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (10:42 IST)
నిజ జీవితం ఆధారంగా కొన్ని సినిమాలను తెరకెక్కించడం. కొన్ని సినిమాల నుంచి స్ఫూర్తి పొంది నిజజీవితంలో అదే తరహాలో కొన్ని పనులు  చేయడం వంటివి సమాజంలో జరుగుతున్న విషయం తెలిసిందే. అంతిమ తీర్పు సినిమాను స్ఫూర్తిగా తీసుకుని తాను పరిటాల రవిని హత్య చేశానని మొద్దు శ్రీను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా సిని ఫక్కీలో దొంగతనాలు, హత్యలకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కూడా అదే కోవకు చెందుతుంది. 
 
ఆ కేసులో ప్రధాన నిందితుడు మారుతీ రావు దృశ్యం సినిమా తరహాలో ఆ కేసు నుంచి బయటకు రావాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. అయితే ఆ ప్లాన్ విఫలం కావడంతో చివరకు మారుతీరావుతో పాటు మిగిలిన నిందితులు కటకటాల పాలయ్యారు. ప్రణయ్‌ను హత్య చేసిన మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అమృతకు జరిగిన అన్యాయంపై సమంత కూడా గళమెత్తారు. అమృత కోరినట్లుగా ఆమె తండ్రిని కఠినంగా శిక్షించాలని, అలాగే నిందితులను వదిలిపెట్టకూడదని సమంత ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. అవసరమైతే అమృతకు అండగా నిలబడి మహిళా సంఘాలను కలుపుకుని వెళ్ళేందుకు సిద్థమంటోంది సమంత. సమంత తీసుకున్న నిర్ణయంపై అక్కినేని కుటుంబంతో పాటు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments