Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ రైతు అబ్బాయిని పెళ్లాడితే అమ్మాయికి రూ. 1 లక్ష గిఫ్ట్...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (20:46 IST)
అరెరె.. వ్యవసాయం చేసే రైతు యువకులకు పెళ్లే కావడం లేదు. దీనితో ఇప్పుడు చాలాచోట్ల వారు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యవసాయం వృత్తిగా చేస్తున్నవారిలో చాలామంది అబ్బాయిల పరిస్థితి ఇలాగే వుంది. కర్నాటక రాష్ట్రంలో పెళ్లి కాక నానా ఇబ్బందులు పడుతున్న రైతు అబ్బాయిలకోసం యల్లాపుర ప్రాంతానికి చెందిన ఆనగోడ గ్రామ సేవా సహకారం సంఘం ఓ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇప్పుడు వైరల్‌గా మారింది. 
 
ఇంతకీ అదేంటయా అంటే... తమ గ్రామానికి చెందిన యువ రైతులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు లక్ష రూపాయలను గిఫ్టుగా ఇవ్వాలని నిర్ణయించడం. తమ గ్రామంలో వ్యవసాయం చేస్తున్న రైతు అబ్బాయిలకు పెళ్లిళ్లు కాకపోతుండటంతో గ్రామ ప్రజలు తీవ్రమైన ఆందోళనలో వుంటున్నారు. ఈ సమస్యను గమనించిన సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఐతే తమ సంఘం ద్వారా పెళ్లాడాలనుకునే యువకులు సభ్యులుగా చేరాలని కండిషన్ పెట్టింది. ఇంకా కలం, మతం ప్రస్తావన లేదని తేల్చి చెప్పింది. 
 
తమ గ్రామానికి చెందిన రైతు అబ్బాయిలను వేరే గ్రామాలకు చెందిన అమ్మాయిలు కూడా పెళ్లాడవచ్చంటూ ఆఫర్ ఇచ్చింది. మరి ఈ అవకాశాన్ని ఎంతమంది అమ్మాయిలు సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments