Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్‌పై ప్రేమ జంట రొమాన్స్: వీడియో వైరల్‌

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (12:20 IST)
Lovers
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఓ ప్రేమజంట నడుస్తున్న బైక్‌పై ప్రేమాయణం సాగిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు బైకును నడుపుతుండగా.. అతని ముందు ఓ యువతి కూర్చుంది. 
 
యువకుడు ఆమెను గట్టిగా హత్తుకుని బైకును నడిపాడు. పెట్రోల్ ట్యాంక్ ముందు కూర్చున్న యువతి బైక్ రైడర్ హత్తుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది.  సాయంత్రం వేళ చీకట్లో వాహనాల హెడ్‌లైట్ల మధ్య ఈ వీడియో చిత్రీకరించిన ఈ దృశ్యాన్ని చూసినవారంతా షాకయ్యారు. 
 
వీడియోలో కనిపించే ప్రదేశం ఘజియాబాద్ జాతీయ రహదారి 9 (ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే) వైపు చూపుతోంది. ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తున్న ఈ వీడియోను ఓ కారు డ్రైవర్ వెనుక నుంచి తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూస్తున్న జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. 
 
ఈ వీడియో ప్రేమను బహిరంగంగా ఇలా వీధుల్లో చూపించడం ప్రస్తుత సమాజానికి అద్దం పడుతుందని కొందరు అంటున్నారు. ఈ వైరల్ వీడియోలో, ట్రాఫిక్ నిబంధనలను ఆ జంట ఉల్లంఘిస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి వీడియోలు గతంలో ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments