మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. దాదాపు దశాబ్దకాలంగా ఎదురు చూస్తున్న ఆ ఆనందక్షణాలు ఇపుడు వచ్చాయి. మెగా తనయుడు రాం చరణ్, ఆయన కోడలు ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. మంగళవారం ఉదయం ఆడ బిడ్డకు ఉపాసన జన్మినిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్టు అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
మరోవైపు తమ మనవరాలిని చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖలు మంగళవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి వచ్చారు. వారి వెంట వారి ఇద్దరి కుమార్తెలు సుష్మిత, శ్రీజలు కూడా వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలావుంటే, తాను మరోమారు తాత అయినందుకు చిరంజీవి ఎక్కడలేని సంతోషం వ్యక్తం చేస్తూ.. మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసారు. "లిటిల్ మెగా ప్రిన్సెస్"కు స్వాగతం అంటూ చిరు ట్వీట్ చేశారు హార్ట్ సింబల్స్‌తో తన మనమరాలిపై ప్రేమను కురిపించారు. నీ రాకతో లక్షలాది మందితో కూడిన మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపావని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నీ రాక ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని" అని అన్నారు.
చెర్రీ-ఉపాసన దంపతులకు ఆడపిల్ల
మెగా ఫ్యామిలీ ఇంటికి మరో మహాలక్ష్మి వచ్చింది. మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్జ జన్మించింది. జూన్ 20వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆస్పత్రి ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో మెగా ఇంటా సంబరాలు మిన్నంటాయి. యువరాణి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ ఓ ప్రకటన చేసింది. ఈ విషయం తెలియగానే తల్లీబిడ్డలను చూసేందుకు మెగాఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి క్యూకట్టారు.
కాగా, చెర్రీ దంపతులకు ఆడిబిడ్డ పుట్టడంతో అటు మెగా, ఇటు కామినేని కుటుంబాల్లో సంబరాలు మిన్నంటాయి. చెర్రీ తన కుమార్తెను చూసి మురిసి పోయారని ఆయన సన్నిహితులు చెప్పారు. మెగా ప్రిన్స్ పుట్టిందంటూ మెగా ఫ్యామిలీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు కుటుంబాలు మంగళవారం ఉదయం 7 గంటలకు ఆస్పత్రికి వెళ్లి చెర్రీ - ఉపాసన దంపతుల కుమార్తెను చూసి, ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలుపనున్నారు.
కాగా, 2012లో ఈ దంపతులకు వివాహం జరిగిన విషయం తెల్సిందే. ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నట్టుగా గత యేడాది నవంబరు నెల 12వ తేదీన వెల్లడించారు. కొన్ని రోజుల క్రితమే ఉపాసనకు సీమంతం దుబాయ్ వేదికగా ఘనంగా నిర్వహించిన విషయం తెల్సిందే. ఇకపోతే, పెళ్లయిన నాటి నుంచి వేరుగా ఉంటున్న చెర్రీ దంపతులు.. తమ బిడ్డ కోసం మామయ్య చిరంజీవి ఇంటికి వెళ్లనున్నట్టు ఇటీవల ఉపాసన తెలిపిన విషయం తెల్సిందే.