Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు నీతో గొడవపెట్టుకోవాలని ఉందక్కా.. సుష్మా మృతిపై స్మృతి ట్వీట్

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (13:52 IST)
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్ మృతిపట్ల కేంద్ర మత్రి స్మృతి ఇరానీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. సుష్మా స్వరాజ్ మృతి చెందిన వార్త తెలుసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంట కన్నీరు కార్చారు. సుష్మా భౌతికకాయానికి నివాళులు అర్పిన స్మృతి ఇరానీ... ఓ ట్వీట్ చేస్తూ, సుష్మాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 
 
"అక్కా.. నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఉందక్కా, బన్సూరీతో కలిసి నన్ను రెస్టారెంట్‌కు తీసుకెళ్తానని మాటిచ్చావు. ఆ ప్రామీస్ నెరవేర్చకుండానే నువ్వు వెళ్లిపోయావు" అని ట్వీట్ చేశారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఏర్పాటైన బీజేపీ తొలి ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీలు కేంద్ర మంత్రులుగా పని చేసిన విషయం తెల్సిందే. 
 
అలాగే, మరో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా తీవ్ర భావోద్వేగానికి గురై... కంటతడి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సుష్మాస్వరాజ్ యావత్ తెలంగాణకు చిన్నమ్మ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆమె అందించిన సహకారాన్ని రాష్ట్ర ప్రజలు మరవలేరని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఆమె తపించేవారని... తమలాంటి వారికి ఆమె స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments