Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు 152, 'రంగస్థలం' రంగమ్మత్తను వదలని రామ్ చరణ్... ఏంటి సంగతి?

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (17:29 IST)
సైరా నరసింహారెడ్డి సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న చిరంజీవి అభిమానులకి మరో పండగ గిఫ్ట్ ఇచ్చేశారు. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
చిరంజీవి నటించనున్న ఈ 152వ సినిమా ఓపెనింగ్‌కి చిరంజీవి భార్య సురేఖ క్లాప్ కొట్టారు. పూజా కార్యక్రమంలో చిరు తల్లి అంజనా దేవి, కుమారుడు నిర్మాత రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. 
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. 
 
ఇక ఈ సినిమాలో చరణ్ కూడా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటనలు ఏవీ లేకున్నా ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్ పాత్ర ఉంటుందని అంటున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర సినిమాకు చాలా కీలకం అని చెప్తున్నారు. ఇందులోనే చిరంజీవి, చరణ్ కలిసి నటించబోతున్నారని అంటున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో రంగస్థంలో చెర్రీకి అత్తగా నటించిన హాట్ యాంకర్ అనసూయ కూడా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments