మరికొన్ని గంటల్లో భారత్‌కు రాఫెల్ యుద్ధ విమానాలు...

Webdunia
బుధవారం, 29 జులై 2020 (08:46 IST)
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలు మరికొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్నాయి. ఫ్రాన్స్ నుంచి సోమవారం బయలుదేరిన ఈ యుద్ధ విమానాలు ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి బుధవారం అంబాలా వాయుసేన బేస్‌కు చేరుకోనున్నాయి. మొత్తం 35 విమానాలను భారత్ కొనుగోలు చేస్తుండగా, వీటిలో తొలి దశలో ఐదు విమానాలను భారత్‌కు ఫ్రాన్స్ పంపిస్తోంది. 
 
ఈ ఐదు విమానాలు మరికొన్ని గంటల్లో అంబాలా ఎయిర్‌బేస్‌లో ల్యాండింగ్ కానున్నాయి. ఒకవేళ రాఫెల్ విమానాలు దిగే సమయంలో అంబాలాలో గనక వాతావరణం బాగోలేకపోతే... జోధ్‌పూర్‌లోని ఎయిర్ బేస్‌ను అధికారులు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. అయితే, ఈ విషయాన్ని అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. 
 
ఫొటోలు నిషిద్ధం... 144 సెక్షన్ విధింపు
మరోవైపు, ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాలు బుధవారం అనుకున్న దాని ప్రకారం అంబాలాకు చేరుకోనున్న విషయం తెలిసిందే. దీంతో వైమానిక స్థావరం చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు తెలిపారు. 
 
అంబాలా ఎయిర్ బేస్ సమీపంలో ఉన్న 4 గ్రామాల్లో కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. విమానాలు ల్యాండయ్యే సమయంలో.. రన్‌వేకు సమీపంలోని ఇళ్లపై ప్రజలు గుమిగూడటం, ఫోటోలు తీయడంపై కూడా నిషేధం విధించామని అంబాలా డీఎస్పీ తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments