పశ్చిమ బెంగాల్‌లో దేశంలోనే అత్యధిక వయస్సున్న పులి కన్నుమూసింది. సోమవారం (జులై 11న) తెల్లవారుజామున 3 గంటలకు మృతిచెందినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.
చనిపోయిన పులి వయస్సు 25 సంవత్సరాల10 నెలలు ఉంటుందని చెప్పారు. ఈ పులి భారత్ లోనే ఎక్కువ కాలం జీవించి ఉన్న పులులలో ఒకటిగా నిలిచిందని తెలిపారు.
నిర్వాహకులు శ్రమించి దానిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత "రాజా" దాదాపు పదిహేనేళ్లు బతికింది. రాజా మృతిపై నిర్వాహకులతో పాటు పలువురు సోషల్ మీడియాలో "వీ మిస్ యూ రాజా" అంటూ నివాళులు అర్పిస్తున్నారు. దానిని చూసేందుకు సందర్శకులు చాలామంది వచ్చేవారని అధికారులు తెలిపారు.