Webdunia - Bharat's app for daily news and videos

Install App

పథకం ప్రకారమే ప్రియాంకా రెడ్డి వాహనం పంక్చర్, అదుపులో నలుగురు

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (16:46 IST)
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ప్రియాంకా రెడ్డి హత్యకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియాంకా రెడ్డి పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని దుండగులు ముందస్తు పథకం ప్రకారమే పంక్చర్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె హత్యకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు.
 
టోల్‌గేట్‌కు సమీపంలో ప్రియాంక స్కూటీని పార్క్ చేయడాన్ని ముందుగానే గమనించిన లారీ డ్రైవర్లు, ఆమె తిరిగి వచ్చేలోపు స్కూటీ టైరును పంక్చర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె తిరిగి స్కూటీ కోసం అక్కడికి రాగానే స్కూటీ పంక్చర్ అయిందనీ, దాన్ని బాగు చేయించుకుని వస్తామంటూ మాయమాటలు చెప్పి ఆ తర్వాత ఆమెను సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోది. 
 
ఈ దారుణానికి పాల్పడిన నిందితులు నలుగురిని పోలీసుల అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రియాంకా రెడ్డి స్కూటీని కొత్తూరు మండలం జేపీ దర్గా సమీపంలో కనుగొన్నారు. ఈ వాహనం ప్రియాంక మృతదేహాన్ని తగులబెట్టిన ప్రాంతానికి సమీపంలోనే లభించింది. ప్రియాంక మృతదేహాన్ని తగులబెట్టేందుకు ఆమె స్కూటీపైనే నిందితులు పెట్రోలు బంకుకి వెళ్లి పెట్రోలు తెచ్చినట్లు సిసి ఫుటేజి ద్వారా తెలుస్తోంది. 
 
నిందితులను మరికొద్దిసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments