Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియాంకా రెడ్డి హత్య కేసును స్వయంగా పర్యవేక్షిస్తా.. : మంత్రి కేటీఆర్

Advertiesment
ప్రియాంకా రెడ్డి హత్య కేసును స్వయంగా పర్యవేక్షిస్తా.. : మంత్రి కేటీఆర్
, శుక్రవారం, 29 నవంబరు 2019 (12:42 IST)
డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఆమెను హత్య చేసేముందు నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు వైద్యుల శవపరీక్షలో తేలింది. 
 
ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు... ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.
 
అయితే, ఈ హత్య కేసుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పైగా, ఈ దారుణానికి పాల్పడిన జంతువులను తెలంగాణ పోలీసులు త్వరగా పట్టుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియాంకాను డీసీఎంలో రేప్ చేశారా? అదుపులో నలుగురు నిందితులు?