Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకే సంచలన నిర్ణయం : నేడు కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన

Webdunia
సోమవారం, 2 మే 2022 (08:40 IST)
జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆఫర్‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన ఆయన.. ఏకంగా కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమయ్యారు. ఆయన సోమవారం కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఉత్తరాదిలో జోరుగా చర్చ సాగుతోంది. 
 
అంతేకాకుండా, ఐప్యాక్ నుంచి తప్పుకుని పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్‌లోనూ అదే హాట్ టాపిక్‌గా మారింది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, బీహార్‌లో ఆదివారం భావసారూప్య పార్టీలతో ఆయన చర్చలు జరిపారు. 
 
మరోవైపు, ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. పైగా, ఆ పార్టీలో కీలక పదవిని ఆశించారు. కానీ, ఆయన ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లించింది. వ్యూహకర్త కమిటీలో ఒక సభ్యుడుగా మాత్రమే ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా రాజకీయ పార్టీని స్థాపించేందుకు మొగ్గు చూపినట్టు వార్తలు వస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments