ప్రభాస్ పెదనాన్నగారా? ఐతే ఏంటి మెట్లు ఎక్కి రమ్మనండి.. ఎవరు?

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (14:37 IST)
రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే తెలియనివారు ఎవరూ వుండరు. ఐతే అలాంటి నటుడుకి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో చేదు అనుభవం ఎదురైంది. దుర్గమ్మకు కుంకుమార్చన చేసేందుకు సతీసమేతంగా కృష్ణంరాజు ఇంద్రకీలాద్రి పర్వతం వద్దకు చేరుకున్నారు. విఐపి దర్శనం ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుందామనుకున్నారు. కానీ ఆలయ సిబ్బంది ఆయనను పట్టించుకోలేదని సమాచారం. 
 
నటుడు కృష్ణంరాజు అని తెలిసినా, ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారనీ తెలిసినా, ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న అని తెలిసినా దుర్గ గుడి సిబ్బంది మాత్రం ఎంతమాత్రం పట్టించుకోలేదట. దానితో కృష్ణంరాజు ఓ సాధారణ భక్తుని క్యూ లైన్లో నిలబడి మొత్తం 6 అంతస్తులు ఎక్కి వెళ్లి దుర్గమ్మను దర్శించుకుని కుంకుమార్చన చేశారట. 
 
ఐతే ఆయనకు మోకాళ్ల నొప్పులు సమస్య వున్నది, పైగా కాస్త అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతున్నారు. ఐనప్పటికీ సీనియర్ నటుడు కృష్ణం రాజును సిబ్బంది అనుమతించకపోవడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు కూడా తన ఆవేదనను తెలిపి అక్కడ నుంచి వెళ్లిపోయారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

Raviteja: రవితేజ కు ఎదురైన ప్రశ్నల సారాంశంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments