Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీకి రాం.. రాం.. : దీర్ఘాలోచనలో ఆర్ఎస్ఎస్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చే ఎన్నికల్లో టాటా చెప్పాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధిష్టానం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులోభాగంగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా ప

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (08:19 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చే ఎన్నికల్లో టాటా చెప్పాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధిష్టానం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులోభాగంగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా మరో నేతను ఎంపిక చేసే పనిలో ఆర్ఎస్ఎస్ నేతలు నిమగ్నమైవున్నట్టు జాతీయ మీడియా కథనాల సమాచారం.
 
దీనికి పలు కారణాలు లేకపోలేదని ఆ కథనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా, గత 2014తో పోలిస్తే ప్రస్తుతం దేశంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) భావిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ మూటముల్లె సర్దుకోవడం ఖాయమన్న అంచనాకు వచ్చింది. ప్రధాని అభ్యర్థిగా మోడీకి మద్దతు లేకపోతే, ఆయన స్థానంలో మరొకరిని తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, ఆయనకు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
అదేసమయంలో త్వరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని ఎదుర్కొనే విషయంలోనూ బీజేపీ తీరుపై ఆరెస్సెస్ అసంతృప్తిగా ఉంది. వారం రోజుల క్రితం హర్యాణాలోని సూరజ్‌కుండ్‌లో జరిగిన బీజేపీ, ఆరెస్సెస్ నేతల మధ్య మూడు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఈ విషయాలు చర్చకు వచ్చినట్టు వినికిడి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments