Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా పేరు మార్చుతారా?

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (18:17 IST)
హైదరాబాద్ నగర కేంద్రంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన విజయ్ సంకల్ప్ పేరుతో భారీ బహిరంగ సభతో ఈ సమావేశాలను పూర్తి చేశారు.
 
అయితే, హైదారబాద్ వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో ఎక్కడా కూడా హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్ అని ప్రస్తావించలేదు. ఆయన హైదరాబాద్ నగరాన్ని భాగ్య నగర్ అంటూ పదేపదే సంభోదించారు. 
 
నాడు భారతదేశాన్ని ఏకం చేసేందుకు సర్దార్ పల్లాభాయ్ పటేల్ భాగ్య నగర్ నుంచే తన ప్రస్థానాన్ని ఆరంభించారని వెల్లడించారు. ఏకీకృత భారతావనికి పటేల్ భాగ్య నగర్ ‌లోనే పునాది రాయి వేశారంటూ కీర్తించారు. పైగా, ఇది మనందరిరికీ చారిత్రక ఘట్టమని మోడీ అభినందించారు. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను బీజేపీ మోగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కేసీఆర్ వైఫల్యాలపై ఈటల రాజేందర్‌తో ప్రధాని మోడీ, జేపీ నడ్డా చర్చలు జరిపినట్లు సమాచారం.
 
ప్రధాని మోడీ, జేపీ నడ్డా ఈటలను మెచ్చుకున్నారని చెబుతున్నారు. ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో విజయం సాధించేందుకు బీజేపీ అన్ని నిర్ణయాలు తీసుకుందని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments