Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులం పేరెత్తితే కాళ్లు విరగ్గొడతా : ఆ కులపోళ్ళకు పవన్ వార్నింగ్ (వీడియో)

తన రాజకీయ పార్టీకి కులం రంగు పులమడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పార్టీకి కులం పేరు అంటగట్టినా, తనకు కులాన్ని ఆపాదించినా కళ్లు విరగ్గొడతానంటూ హెచ్చరించారు.

Webdunia
గురువారం, 5 జులై 2018 (13:23 IST)
తన రాజకీయ పార్టీకి కులం రంగు పులమడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పార్టీకి కులం పేరు అంటగట్టినా, తనకు కులాన్ని ఆపాదించినా కళ్లు విరగ్గొడతానంటూ హెచ్చరించారు.
 
విశాఖపట్నం కళావాహిని పోర్ట్ స్డేడియంలో జనవేన పార్టీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, ఆ కులపోళ్లు పార్టీ పెడితే వారికి మాత్రం కులం వర్తించదా? దళితులు రాజకీయ పార్టీ స్థాపిస్తే దాన్ని దళితలు పార్టీ అంటారా? ఏం.. మీరు పార్టీపెడితే అది మీ కులం పార్టీ కాదా అంటూ ఓ వర్గానికి చెందిన నేతలపై ఆయన మండిపడ్డారు. 
 
పైగా, తన పార్టీకి కులం పేరు అంటగడితే కాళ్లు విరగ్గొడతానంటూ హెచ్చరించారు. అదేసమయంలో తనవద్ద డబ్బు లేదనీ, టీవీ చానెల్స్ లేవన్నారు. కానీ నిర్భయంగా పోరాడే ధైర్యముందన్నారు. 
 
ఇకపోతే, తనకున్న ఆవేశానికి, అన్యాయానికి ఎక్కడ తీవ్రవాద ఉద్యమాల్లోకి పోతాడోనన్న ఆందోళనతో, ఓ తుపాకీ కొనిస్తే ఇంట్లోనే ఉంచవచ్చని ఆలోచించి, ఆనాడు తన అన్నయ్య చిరంజీవి తనకు ఓ తుపాకీని కొనిచ్చారని గుర్తుచేశారు. 
 
తన అవేదన, ఆవేశం అన్యాయం మీదనే తప్ప, తుపాకీ కోసం కాదని ఆనాడు తన అన్నకు వివరించలేకపోయానని చెప్పారు. ఆనాడు దాన్ని తీసుకున్న వేళ ఎలా వాడాలో కూడా తెలియలేదని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేస్తుంటే ప్రశ్నించకుండా ఎలా ఉండగలుగునని, రోడ్లపైకి వచ్చి నిలదీయకుండా ఎలా ఉండగలనని అన్నారు. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments