Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇమ్రాన్‌ పొదుపు మంత్రం : కార్లు వేలం, అపార్ట్‌మెంట్‌లో నివాసం

పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పొదుపు మంత్రం జపిస్తున్నారు. లగ్జరీ లైఫ్‌ అనుభవించే ప్రభుత్వ అధికారులపై కొరడా ఝుళిపించారు. వీఐపీ కల్చర్‌ అన్న పదాన్నే తుడిచేయాలని చెబుతున్నారు. ఆయన తీసుకుంటు

Webdunia
ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (14:11 IST)
పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పొదుపు మంత్రం జపిస్తున్నారు. లగ్జరీ లైఫ్‌ అనుభవించే ప్రభుత్వ అధికారులపై కొరడా ఝుళిపించారు. వీఐపీ కల్చర్‌ అన్న పదాన్నే తుడిచేయాలని చెబుతున్నారు. ఆయన తీసుకుంటున్న పొదుపు చర్యలు చాలా మందిని విస్మయానికి గురి చేస్తున్నాయి.
 
ఈ పొదుపు చర్యలను కూడా తన కార్యాలయం నుంచే ఆయన ప్రారంభించడం గమనార్హం. 134 ఎకరాల్లో విస్తరించిన రాజప్రాసాదం, 524 మంది సిబ్బంది ఉన్న ప్రధాని అధికారిక నివాసాన్ని కాదనుకొని 3 బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌లో నివశించాలని నిర్ణయించారు. కేవలం ఇద్దరు సర్వెంట్స్‌ని మాత్రమే పనిలో ఉంచుకున్నారు. ప్రధాని నివాసాన్ని యూనివర్సిటీగా మారుస్తానని ప్రకటించారు. 
 
ఇకపోతే, పాక్‌లో అత్యున్నత అధికారులు విమానాల్లో ఫస్టక్లాస్‌ ప్రయాణాలపై నిషేధం విధించారు. అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఫస్ట్‌క్లాస్‌ బదులుగా ఇక బిజినెస్‌ క్లాసులోనే ప్రయాణించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 
 
అలాగే, ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశాల సమయంలో గత ప్రభుత్వాలు రకరకాల నోరూరించే వంటకాలతో భోజనం ఏర్పాటు చేసేవారు. ఇపుడు అలాంటి భోజనాలను నిషేధించారు. ఇప్పుడు సమావేశాల సమయంలో కనీసం బిస్కెట్లు కూడా ఇవ్వడం లేదని ఒక అధికారి వాపోయారంటే తిండిఖర్చుని ఎంత తగ్గించారో అర్థమవుతుంది. 
 
అదేవిధంగా, ప్రధాని నివాసంలో అంతగా వినియోగంలో లేని 33 లగ్జరీ కార్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నివాసంలో సెప్టెంబర్‌ 17న ఈ వేలం జరుగుతుంది. ఎనిమిది బీఎండబ్ల్యూ కారులు, నాలుగు మెర్సెడెస్‌ బెంజ్‌ కార్లు, 16 టయోటా కార్లతో పాటుగా నాలుగు బుల్లెట్‌ ప్రూప్‌ వాహనాలు, ఒక హోండా సివిక్‌ కారు, మూడు సుజుకి వెలికల్స్‌తో పాటుగా 1994 మోడల్‌కు చెందిన హినో బస్సు కూడా వేలం వేస్తారు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బుల్ని ఖజానాలో జమ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments