Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2019 క్రికెట్ ప్రపంచ కప్ మాదే : ఫకార్ జమాన్

వచ్చే యేడాది జరిగే క్రికెట్ ప్రపంచ కప్‍ను తమ జట్టు సొంతం చేసుకుంటుందని పాకిస్థాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇంగ్లండ్ వేదికగా జరిగే 2019 ప్రపంచ కప్‌ కోసం బయలుదేరే త

Advertiesment
Fakhar Zaman
, ఆదివారం, 26 ఆగస్టు 2018 (13:11 IST)
వచ్చే యేడాది జరిగే క్రికెట్ ప్రపంచ కప్‍ను తమ జట్టు సొంతం చేసుకుంటుందని పాకిస్థాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇంగ్లండ్ వేదికగా జరిగే 2019 ప్రపంచ కప్‌ కోసం బయలుదేరే తమ జట్టు టైటిల్ గెలవడానికే వెళుతున్నట్టు చెప్పాడు.
 
2019 ప్రపంచ కప్ కోసం మా జట్టుకు ఫేవరేట్ లేబుల్ ఇవ్వడం సరైనదని నేను భావిస్తున్నాను. ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌ను పాకిస్థాన్ గెలుస్తుంది. టోర్నీలో పాక్ జట్టు ఖచ్చితంగా హాట్ ఫేవరెట్ అని ఫకార్‌ తెలిపారు. 
 
ఇకపోతే, సెప్టెంబరు 15 నుంచి జరగనున్న ఆసియా కప్‌‌లో రాణించడంపైనే దృష్టి పెట్టాను. ఆసియా కప్‌‌లో పాకిస్థాన్ జట్టు టీమిండియాను ఎదుర్కొనే అవకాశముంది.. ఆ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా. ప్రపంచకప్‌కు చాలా సమయం ఉంది కనుక ప్రస్తుతం ఉ‍న్న సిరీస్‌లపై దృష్టిసారిస్తున్నట్లు స్పష్టంచేశారు. 
 
కాగా, ఫకార్ జమాన్ తన చివరి నాలుగు ఇన్నింగ్స్‌లలో 85, 210 (నాటౌట్), 43(నాటౌట్), 117  స్కోర్ చేశారు. తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 210 పరుగులు చేసి పాక్ తరపున డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఫకార్ జమాన్ రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాట్ కోహ్లీ షాంపైన్ గిఫ్ట్.. ఎవరికిచ్చారో తెలుసా?