Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో సెన్సేష‌న‌ల్ హీరో న‌టిస్తున్నాడా..?

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌ధ ఆధారంగా రూపొందుతోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్ పాత్ర‌ను పోషిస్తుండ‌డంతో పాటు బాల‌కృష్ణ ఈ సినిమాని నిర్మిస్తుండ‌టం విశేషం. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (12:52 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌ధ ఆధారంగా రూపొందుతోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్ పాత్ర‌ను పోషిస్తుండ‌డంతో పాటు బాల‌కృష్ణ ఈ సినిమాని నిర్మిస్తుండ‌టం విశేషం. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో భారీ తారాగ‌ణం ఉండ‌టంతో ఈ మూవీపై మ‌రింత క్రేజ్ పెరిగింది. ఇటీవ‌ల చంద్ర‌బాబు పాత్ర‌లో న‌టిస్తున్న రానాపై , అక్కినేని పాత్ర‌లో న‌టిస్తున్న సుమంత్ పైన కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ చిత్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కూడా చూపించనున్నారని  తెలిసింది. తాజా సమాచారం ప్రకారం... కేసీఆర్ పాత్ర‌ను సెన్సేష‌న‌ల్  హీరో విజయ్ దేవరకొండ నటించబోతున్నట్లు తెలిసింది. కేసీఆర్ పాత్రకు విజయ్ అయితే బాగుంటాడని దర్శకనిర్మాతలు బావిస్తున్నారట. 
 
ఇక స్వతహాగా ఎన్టీఆర్‌కి కేసీఆర్ వీరాభిమాని. పైగా కేసీఆర్ రాజకీయ జీవితానికి పునాది వేసింది ఎన్టీఆరే. అందుకే ఈ చిత్రంలో కేసీఆర్‌ని చూపిస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని జ‌న‌వ‌రి 9న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. ఇదే క‌నుక నిజ‌మైతే... కేసీఆర్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎలా ఉంటాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం
Show comments