Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఎవర్ గివెన్" భారీ నౌకను కదిలించిన పున్నమి చంద్రుడు!

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (18:52 IST)
సూయెజ్ కాలువులో చిక్కుకున్న భారీ నౌకను టగ్ బోట్లు కదిలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. కానీ, ఆ బోట్లు భారీ నౌకలు ఒక అంగుళం కూడా కదిలించలేకపోయాయి. కానీ, పున్నమి చంద్రుడు ఆ నౌకను నీటిలోకి తోసి.. తన గమ్యస్థానం చేరుకునేందుకు మార్గం చూపించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల సూయెజ్ కాలువలో భారీ ఎవ‌ర్ గివెన్ నౌక చిక్కునిపోయిన విషయం తెల్సిందే. 1300 ఫీట్ల వెడ‌ల్పు ఉన్న ఆ నౌక‌ను క‌దిలించేందుకు.. మ‌హా యంత్రాంగ‌మే రంగంలోకి దిగింది. అడ్డంగా చిక్కుకున్న నౌక వ‌ల్ల వేల కోట్ల రూపాయల వ్యాపారం స్తంభించిపోయింది. 
 
ఆ నౌక‌ను మ‌ళ్లీ దారిలో పెట్టేందుకు ఊహించ‌ని స్థాయిలో డ్రెడ్జింగ్ చేప‌ట్టారు. ట‌గ్ బోట్ల‌తో ఆ స‌రుకు నౌక‌ను క‌దిలించే ప్ర‌య‌త్నమూ చేశారు. కానీ ఆ ఇంజినీర్ల కృషి పనిచేయలేదు. కానీ, ప్ర‌కృతి కరుణించడంతో ఆ భారీ నౌక తిరిగి గాడిలో పడింది. 
 
సాధారణంగా పున్న‌మి రోజున ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. ఆదివారం సూప‌ర్‌మూన్ కావ‌డంతో.. భారీ అల‌లు వ‌చ్చాయి. డ్రెడ్జింగ్‌కు అల‌లు తోడుకావ‌డంతో.. ఎవ‌ర్ గివెన్ నౌక స‌ముద్ర నీటిలో ఈజీగా తేలిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. పున్న‌మి చంద్రుడే వ‌ల్లే నౌక క‌దిలింద‌న్న ఊహాగానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.
 
సూయెజ్ కాలువ‌లో ఎవ‌ర్ గివెన్ నౌక క‌దిలినా.. అస‌లు ఆ నౌక ఎందుకు అక్క‌డ అలా చిక్కుకుపోయిందో తెలుసుకునేందుకు ఇప్పుడు అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఎవ‌ర్ గివెన్ నౌక స్తంభించ‌డం వ‌ల్ల సుమారు 369 బోట్లు ఎక్క‌డికి అక్కడ నిలిచిపోయాయి. మ‌ధ్య‌ద‌రా, ఎర్ర స‌ముద్రంలో ఆ నౌక‌లు ఆగిపోయాయి. అవ‌న్నీ క్లియ‌ర్ అయ్యేందుకు మ‌రింత స‌మ‌యం ప‌డుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments