Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్ జోంగ్ ఉన్ స్నేహాస్తం : అణు పరీక్షలకు ఉత్తర కొరియా స్వస్తి

నిన్నమొన్నటివరకు బద్ధశత్రువులుగా మెలిగిన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య స్నేహం వెల్లివిరిసింది. పాతకాలపు వైరాన్ని పక్కనబెట్టి ముందుకుసాగాలని ఈ రెండు దేశాధినేతలు నిర్ణయించారు.

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (08:29 IST)
నిన్నమొన్నటివరకు బద్ధశత్రువులుగా మెలిగిన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య స్నేహం వెల్లివిరిసింది. పాతకాలపు వైరాన్ని పక్కనబెట్టి ముందుకుసాగాలని ఈ రెండు దేశాధినేతలు నిర్ణయించారు. ఇందులోభాగంగా, అణు పరీక్షలకు స్వస్తి చెప్పనున్నట్టు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. ఇందుకోసం అణు పరీక్షల కేంద్రాన్ని మే నెలలో మూసివేస్తామని, ఆ ప్రక్రియను పరిశీలించేందుకు అమెరికా నిపుణులకు కూడా ఆహ్వానిస్తున్నట్టు ఉత్తర కొరియా ప్రకటించింది.
 
ఈనెల 27వ తేదీ శుక్రవారం ఉభయ కొరియాల అధ్యక్షులు కిమ్‌ జాంగ్‌ ఉన్‌, మూన్‌ జే ఇన్‌‌లు కీలక సమావేశం నిర్వహించిన విషయం తెల్సిందే. దక్షిణాఫ్రికా గడ్డపై కాలుమోపిన కింమ్ జోంగ్ ఉన్ చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత దక్షిణ కొరియా అధినేత మూన్ జే ఇన్‌తో కలిసి ఇరు దేశాల సంబంధాలతో పాటు పలు అంశాలపై చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
 
కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణకు ఇరువురు నేతలు ఆ సమావేశంలో అంగీకారం తెలిపారు. ఆ సందర్భంలోనే వచ్చేనెలలో అణు పరీక్షల కేంద్రాన్ని మూసివేస్తానని మూన్‌కు కిమ్‌ తెలిపారు. ఆ ఘట్టాన్ని పరిశీలించేందుకు, పారదర్శకంగా అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు దక్షిణకొరియా, అమెరికా నిపుణులకు, విలేకరులకు కిమ్‌ ఆహ్వానం పలికారని దక్షిణ కొరియా అధినేత మూన్‌ జే ఇన్‌ అధికార ప్రతినిధి యూన్‌ యంగ్చాన్‌ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments