Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోయిడా పోలీసులా మజాకా : బస్సు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదనీ...

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (12:18 IST)
దేశంలో సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి కొత్త మోటారు వాహన చట్టం 2019 అమల్లోకి చ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిననాటి నుంచి దేశంలో ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. అర్థం పర్థం లేని నిబంధనలతో అయినదానికి, కానిదానికి జరిమానాలు ఎడాపెడా వసూలు చేస్తున్నారు. 
 
తాజాగా నోయిడాలో బస్సు డ్రైవర్‌ హెల్మెట్‌ పెట్టుకోలేదని ఆన్‌లైన్‌ చలాన్‌ విధించారు. హెల్మెట్‌ పెట్టుకోకుండా బస్సు నడుపుతున్నందుకు రూ.500 కట్టాలని నోటీసు పంపించారు. దీంతో ఆ డ్రైవర్‌ బిత్తరపోయి.. ఈ విషయాన్ని బస్సు యాజమానికి తెలిపాడు. 
 
నోయిడాకు చెందిన నిరాంకార్‌ సింగ్‌కు సొంతంగా 40 నుంచి 50 బస్సులు ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు, కంపెనీలకు తన బస్సులను అద్దెకిచ్చి నడిపిస్తుంటాడు. సెప్టెంబర్‌ 11వ తేదీన ఆయనకు ఒక చలాన్‌ వచ్చింది. తన బస్సు నడుపుతున్న డ్రైవర్‌ హెల్మెట్‌ పెట్టుకోలేదని, అందుకు రూ.500 చలాన్‌ చెల్లించాలని ట్రాఫిక్‌ పోలీసులు నోటిసు పంపారు. 
 
దీంతో బిత్తరపోయిన నిరాంకర్‌ సింగ్‌ డ్రైవర్‌ బస్సు నడిపేందుకు హెల్మెట్‌ ఎందుకు పెట్టుకోవాలంటూ విస్తుపోయారు. ట్రాఫిక్‌ సిబ్బంది ఒకవేళ పొరపాటున తనకు ఈ చలాన్‌ పంపించి ఉండొచ్చునని, కానీ, ఒక బస్సు యాజమానికే ఇలాంటి చలాన్‌ వస్తే పరిస్థితేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments