Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాముడ్ని మోసం చేసిన బీజేపీ ఓడిపోతుంది.. పూజారి శాపనార్థాలు

భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పేలా లేవు. ఒకవైపు ప్రజాగ్రహం మరోవైపు పూజారుల శాపనార్థాలు కలిసి ఆ పార్టీని చిత్తుగా ఓడించేలా కనిపిస్తున్నాయి.

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (10:55 IST)
భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పేలా లేవు. ఒకవైపు ప్రజాగ్రహం మరోవైపు పూజారుల శాపనార్థాలు కలిసి ఆ పార్టీని చిత్తుగా ఓడించేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉపఎన్నికల్లో వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఆకాశం వైపు చూడటం మాని నేలచూపు చూస్తున్నారు.
 
శ్రీరాముడి పేరు చెప్పుకుని 2014లో అధికారంలోకి వచ్చి, ఆపై ఆయన్ను మరచిపోయినందునే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఓడిపోతున్నదని అయోధ్య రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య ఎస్.దాస్ శాపనార్థాలు పెట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే, వెంటనే రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని, లేకుంటే బీజేపీకి అధికారాన్ని నిలుపు కోవడం క్లిష్టతరమవుతుందని ఆయన జోస్యంచెప్పారు. 
 
ఇకపోతే, తక్షణమే రామమందిరాన్ని నిర్మించకుంటే ఉద్యమిస్తామని చావాని టెంపుల్ అర్చకుడు మహంత్ పరమహంస దాస్ హెచ్చరించిన గంటల వ్యవధిలోనే ఆచార్య దాస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రామమందిరం కోసం ఉద్యమం జరిగితే బీజేపీకి ఓటమి తప్పదని, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. గత ఎన్నికల్లో రాముడు పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో రాముడుని మోసం చేసినందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని వారు హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments