Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ తల్లిదండ్రులకు నిర్భయ తల్లి అండ... మీకు మాలాగా జరగదు అంటు భరోసా

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (13:44 IST)
హైదరాబాద్ నగరంలో అత్యాచారం, ఆ తర్వాత హత్యకు గురైన దిశ తల్లిదండ్రులకు ఢిల్లీకి చెందిన నిర్భయం తల్లిదండ్రులు అండగా నిలిచి, తమ నైతిక మద్దతును ప్రటించారు. ఈ మేరకు నిర్భయ తల్లి నుంచి దిశ తల్లిదండ్రులకు ఓ సందేశం వచ్చింది. తమ బిడ్డను దారుణాతి దారుణంగా హత్య చేసిన దోషులకు సరైనశిక్ష పడలేదని, తద్వారా తమకు న్యాయం జరగలేదని నిర్భయం తల్లి వాపోయారు. 
 
కానీ, హైదరాబాద్ నగరంలో హత్యకు గురైన దిశ తల్లిదండ్రులకు మాత్రం సత్వర న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. 'హైదరాబాద్‌లో పశువైద్యురాలు అత్యాచారం, హత్య అత్యంత దారుణం. మా బిడ్డ విషయంలో మేము ఏడేళ్లుగా పోరాడుతూనే ఉన్నాము. కానీ, దిశ విషయంలో న్యాయం త్వరితగతిన జరుగుతుంది. నాటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి' అని దిశ తల్లిదండ్రులకు నిర్భయ తల్లి పంపిన సందేశంలో పేర్కొన్నారు. 
 
కాగా, న్యూఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో ఆశాదేవి కుమార్తె నిర్భయ (23)ను ఆరుగురు కామాంధులు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి నుంచి 17 తెల్లవారుజాము వరకూ ఈ దారుణం జరుగగా, 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాధితురాలు కన్నుమూసింది. దేశ యువతలో వెల్లువెత్తిన నిరసనతో చట్టాలు కఠినమయ్యాయి. కొత్తగా నిర్భయ చట్టం వచ్చిందన్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments