Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ కార్యాలయం...

Advertiesment
ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ కార్యాలయం...
, బుధవారం, 13 నవంబరు 2019 (15:08 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు బుధవారం మరో అత్యంత కీలక కేసులో తుది తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ కేసులో గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పునిచ్చింది. 
 
న్యాయ వ్యవస్థను మరింత పారదర్శకంగా మలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాఖ్యానించింది. సీజేఐ, ఆయన కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ ఢిల్లీ హైకోర్టు 2010లో వెలువరించిన తీర్పును సమర్థించింది. సమాచార హక్కు, గోప్యత హక్కు నాణేనికి రెండు ముఖాల వంటివని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే హై ఓల్టేజ్ తీగలపై నడవాలని చూశాడు.. చివరికి?